ఒకప్పుడు మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు.ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన అలా మారుతుంది కాబట్టి.
వాళ్లకు ఒక హోదా రావడంతో ఆ హోదాతో బాగా చెలరేగిపోతుంటారు.ప్రతి విషయంలో బాగా షోలు చేస్తూ ఉంటారు.
దీంతో వారికి బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.తాజాగా శివ జ్యోతి కూడా బాగా ట్రోల్స్ ఎదురుకుంది.
ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.తీన్మార్ సావిత్రిగా శివ జ్యోతి తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా పరిచయమయ్యింది.
శివ జ్యోతి తన తెలంగాణ యాసతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.అలా ఆమెకు మంచి అభిమానం ఏర్పడటంతో బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.అందులో తన ఆటపాటలతో మరింత పరిచయం పెంచుకుంది.

ఇక బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి బాగా మారిపోయిందని చెప్పాలి.ముఖ్యంగా తన డ్రెస్సింగ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచింది.బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మంచి మంచి డ్రెస్సులను ధరించిన శివ జ్యోతి బయటికి వచ్చాక తన గ్లామర్ ను పరిచయం చేసింది.
పొట్టి పొట్టి బట్టలు వేస్తూ గ్లామర్ గా తయారవుతూ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది.తన బిగ్ బాస్ ఫ్రెండ్స్ తో కలిసి బాగా సందడి చేస్తూ ఉంటుంది.
సమయం వచ్చిన్నప్పుడల్లా వారితో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక యూట్యూబ్లో ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో ఇప్పటికి చాలా వీడియోస్ పంచుకుంది.చాలా వరకు నగలు కొన్నాను అంటూ, చీరలు కొంటున్నాను అంటూ వీడియోస్ బాగా పంచుకుంటుంది.

నిజానికి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు చాలా వరకు తనవి షాపింగ్ వీడియోస్ ఉంటాయి.ఇక ఆ వీడియోస్ చూసిన నెటిజన్స్ ఆమెను బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఎప్పుడు షాపింగ్ లేనా అంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.ఇక ట్రిప్స్ కి వెళ్ళినా కూడా అక్కడ తీసిన వీడియోస్ కూడా బాగా పంచుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా తను పంచుకున్నట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది.ఇక ఆ వీడియోలో.ఈ గుల్ మార్గ్ ట్రిప్పు ఏమో కానీ నా జుట్టు అంతా ఊశిపోయింది అంటూ తంబునేయిల్ పెట్టింది.అయితే ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఏంటో నీ ఓవర్ యాక్టింగ్ హీరోయిన్ కంటే ఎక్కువయ్యింది నీది అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇక మరి కొంతమంది నీకు ఎప్పుడు ఇదే పనినా అంటూ.
ఎప్పుడు ఏదో ఒక వీడియో షేర్ చేస్తూనే ఉంటావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.