శ్రీ వెంకటేశుడి దివ్య మహత్మ్యాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన భార్యలు పద్మావతి, అలివేలు మంగమ్మ గురించి కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే.
అలాగే అందరికీ బీబీ నాంచారమ్మ గురించి తెలుసు కానీ.ఆమె గురించిన వివరాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
బీబీ నాంచారమ్మ ఓ ముస్లిం మహిళ.
తురుష్కులు దేవాలయాలపై దండయాత్రలు చేసే వారు.
గుళ్లపై దాడులు చేసి దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసే వారు.కొన్నింటిని అపహరించి తమ వెంట తీసుకెళ్లేవారు.
అలా ఒకరోజు తురుష్కులు నారాయణ పురంలోని తిరు నారాయణ స్వామి ఉత్సవ విగ్రహమైన సంపత్ కుమారస్వామి మూర్తిని కూడా అలాగే అపహరించారు.ఆపై డిల్లీకి తీసుకెళ్లారు.
ఆ విగ్రహ సౌందర్యం చూసి పరవశించిపోయిన బీబీ నాంచారమ్మ ఆ విగ్రహాన్ని తనతో పాటు ఉంచుకుంది.
ఆపై కొంత కాలానికి శ్రీ భగవద్రామానుజులు ఢిల్లీకి పోయి సుల్తానును ఒప్పించి విగ్రహాలను తీసుకుని తిరునారాయణపురానికి బయలు దేరారు.
ఆ మూర్తిని గాఢంగా ప్రేమించిన బీబీ నాంచారమ్మ కూడా ఆ విగ్రహాన్ని అనుసరించి వెళ్లి నారాయణపురం చేరింది.అక్కడ ప్రతిష్ఠించిన స్వామి వారి ఉత్సవ మూర్తిని విడిచి రాలేక అక్కడే స్వామిలో ఐక్యమైంది.
ఈ రీతిగా ఆండాళ్ వలే స్వామిని ప్రేమించిన బీబీ నాంచారమ్మ విగ్రహాన్ని చేయించిన శ్రీరామానుజులు శ్రీరంగంలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారు.ఇప్పటికీ ఆ విగ్రహానికి అక్కడ పూజాది కైంకర్యాలు నిర్వహించబడుతున్నాయి.