ఇదేం విడ్డూరంరా బాబు.. జాబ్ అప్లై చేసిన 8 ఏళ్లకు రిజెక్ట్ చేశారట!

ఉద్యోగం కోసం అందరు వెయిట్ చేస్తూనే ఉంటారు.తమ చదువుకు తగిన జాబ్ రావాలని కొంతమంది భావిస్తే.

ఏదో ఒకటి వస్తే చాలని మరికొంత భావించి వచ్చిన ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు.అయితే అన్ని చోట్ల నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ గానే ఉంది.

వాళ్ళు ఎప్పుడు చేతిలో రెస్యూమ్ పట్టుకుని ఒక్క చోట అయినా ఉద్యోగం రాకపోతుందా అని ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు.కొంతమంది ఇంటర్వ్యూ లలో మంచి పర్ఫర్మ్ చేసిన సరే వాళ్లకు ఆ ఉద్యోగం లభించదు.

తమకు లక్ లేదని చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటారు.అయినా చేతులు కట్టుకుని కూర్చో కుండా ట్రై చేస్తూనే ఉంటారు.

Advertisement

అలానే ఒక మహిళ కూడా ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉండేది.తెలిసిన ఇంటర్వ్యూ లకు వెళ్ళేది.

అయితే ఆ మహిళా గత 8 సంవత్సరాల క్రితం చేసిన ఇంటర్వ్యూ గురించి ఇప్పుడు రిప్లై వచ్చిందట.

ఏంటి నమ్మడం లేదా.అవునండి ఇది నిజం.ఆ మహిళా 8 సంవత్సరాల క్రితం వెళ్లిన ఇంటర్వ్యూ రిజల్ట్ ఇప్పుడు వచ్చిందట.

ఎవరైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసే కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారికీ ఒక రోజు లోనే లేదంటే వారం రోజుల్లోనే రిప్లయ్ ఇస్తారు.కాని ఈ మహిళకు మాత్రం ఇంటర్వ్యూ కు వెళ్లి వచ్చిన 8 సంవత్సరాలకు ఆ కంపెనీ నుండి రిప్లయ్ వచ్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

దీంతో ఆ మహిళా షాక్ అయ్యిందట.జో జాన్సన్ అనే మహిళా 2013లో కెంట్ లోని కాంటర్ బరీ లో టీచింగ్ అసిస్టెంట్ కోసం ఖాళీ ఉంటె అప్లై చేసిందట.ఉద్యోగం కోసం కొన్ని రోజులు ఎదురు చూసి ఇక ఎటువంటి రిప్లై రాకపోవడంతో ఆమె సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేసుకుంది.

Advertisement

అయితే తాజాగా ఆమె అప్లికేషన్ ను రిజక్ట్ చేసినట్టు రిప్లై వచ్చింది.దానిని చూసి కొద్దీ సేపు ఆలోచించక కానీ ఆమెకు గుర్తు రాలేదు.ఇక ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యింది.

తాజా వార్తలు