50 లక్షలతో డైనింగ్ హాల్, అదనపు తరగతి గది నిర్మాణానికి భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 50 లక్షల తో నిర్మించబోయే డైనింగ్ హల్,అదనపు తరగతి గదుల నిర్మాణానికి మంగళవారం మండల ఎంపీపీ పిల్లి రేణుక కిషన్,భారాస రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి, జడ్పీటిసి లక్ష్మణ్ రావు,ఎంపీటీసీ గీతాంజలి , మాజీ ఏఎంసి చైర్మన్లు గుల్లపెళ్లి నరసింహారెడ్డి ,కొండ రమేష్ పాలకవర్గ సభ్యులు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News