2018లో వృశ్చికరాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి....లేకపోతే ఇబ్బందులు తప్పవు 2018

వృశ్చికరాశి వారు 2018 లో కొన్ని ఆనందాలను మరియు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండుట వలన ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

వీరు తీసుకొనే కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు.అయితే వీరు ఇతరులకు ఇచ్చే సలహాలు బాగా పనిచేస్తాయి.

2018 Vruschika Rasi Phalithamulu-2018 Vruschika Rasi Phalithamulu-Devotional-Tel

ఇప్పుడు 2018లో వృశ్చికరాశి వారు ఏ సమస్యల్లో ఇబ్బందులు ఎదుర్కుంటారో తెలుసుకుందాం.ఈ రాశి వారు కుటుంబ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటారు.

అలాగే ఇంటిలో అందరి ఆప్యాయత దొరుకుతుంది.అందరితోనూ అన్యోన్యంగా ఉంటారు.

Advertisement

అంతేకాక కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు.కుటుంబంలో కొన్ని ఖర్చులను భరించవలసి వస్తుంది.

ఈ రాశిలో శని ఉండుట వలన వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.మీరు మీ భార్య దగ్గర ఏదైనా విషయాన్ని దాచాలని ప్రయతించిన,అబద్దాలు ఆడినా అడ్డంగా దొరికిపోతారు.

కాబట్టి సాధ్యమైనంత వరకు మీ భార్యతో నిజాలు చెప్పటానికి ప్రయత్నం చేయండి.కుటుంబం ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.

మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే మీ తోబుట్టులు సహాయం చేయటానికి సిద్ధంగా ఉంటారు.శని 8వ స్థానంలో ఉండి మిమ్మల్ని కొంచెం ఇబ్బందులకు గురి చేస్తాడు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

కాబట్టి 2018లో వృశ్చికరాశి వారు 40 రోజుల పాటు శని సోత్రాన్ని పఠించాలి.దీని వల్ల మీరు చాలా సమస్యల నుంచి తప్పించుకుంటారు.2018లో వృశ్చికరాశి వారు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.కంటికి సంబంధించి, చెవి సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

అలాగే కొన్ని ఆహారాల కారణంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు.కాబట్టి తీసుకొనే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి.2018లో వృశ్చికరాశి వారు ఆర్ధిక పరమైన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.ఎందుకంటే కొన్ని అనవసర ఖర్చులు పెట్టె అవకాశం ఉంది.

బృహస్పతి మీ రాశిలో ప్రథమ స్థానంలోకి రావడం వల్ల అక్టోబర్ నుంచి మీకు ఆర్ధికంగా చాలా బాగుంటుంది.అంతేకాక ఆదాయం కూడా బాగా పెరుగుతుంది.

మీరు నిరుద్యోగులుగా ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.అయితే విదేశాల్లో చదవాలని అనుకుంటే మాత్రం అనుకూలంగా ఉంటుంది.2018లో వృశ్చికరాశి వారికి వ్యాపారం చాలా బాగుండి మంచి లాభాలు వస్తాయి.ఎటువంటి నష్టాలు ఉండవు.

ఎటువంటి చింతలు లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడపవచ్చు.మీ జీవిత భాగస్వామితో మీరు ప్రేమగా ఉంటారు.

అలాగే సంసార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు.చిన్న చిన్న సమస్యలు వచ్చిన పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు.మీరు 4.25 క్యారెట్స్ ఉండే ఎరుపు రంగు ఉంగరాన్ని ధరించడం చాలా మంచిది.అలాగే రోజు హనుమాన్ చాలిసా కూడా చదివితే మంచిది.

కోపం వచ్చినప్పుడు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం.

తాజా వార్తలు