రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీశైలం గౌడ్ గారు హాజరయ్యారు.షాపూర్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజా బ్యాలెట్ ద్వారా విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుపై స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని సవాల్ చేసి, వారం రోజులైనా ఇప్పటికీ స్పందించకపోవడం ఎమ్మెల్యేకు కుత్బుల్లాపూర్ ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది అన్నారు.ఈ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోకపోతే, ఏప్రిల్ 1 తర్వాత నియోజకవర్గంలో టిఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని, బస్తీలలో తిరగనీయమని హెచ్చరించారు.