తెలంగాణలో 18 జిల్లాలు ఔట్...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది.

రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 10 ఉమ్మడి జిల్లాలు ఉండగా పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాటి ప్రభుత్వం దశల వారీగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది.

అన్ని జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ ను కూడా కల్పించింది.కానీ,ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ సుమారు 18 జిల్లాలను తొలగించి, 17 లోక్ సభ నియోజకవర్గాలను 17 జిల్లాలుగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ,ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిందని,దానితో మళ్ళీ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశం ప్రకంపనలు సృష్టిస్తోందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇందులో నిజానిజాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

పంచాయతీ కార్యదర్శి చేసిన పనికి ఫిదా అయిన గ్రామస్తులు...!
Advertisement

Latest Nalgonda News