11 ఏళ్లకే బుక్ రాసేసి .. పిన్న వయస్కురాలైన కవయిత్రిగా గుర్తింపు, భారత సంతతి చిన్నారి ఘనత

భారత సంతతికి చెందిన 11 ఏళ్ల చిన్నారి అష్లీన్ ఖేలా( Ashleen Khela ) ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత సాధించింది.

ఆస్ట్రేలియాలో పిన్న వయస్కురాలైన మహిళా రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఆమె రచించిన ‘‘ 17 స్టోరీస్’’ పుస్తకంతో ఖేలా ఈ ఘనత సాధించింది.సాహిత్య విజయాన్ని మించి.

ఈ పుస్తకం విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును భారతదేశంలోని వెనుకబడిన చిన్నారులకు సహాయం చేసేందుకు వినియోగించాలని క్యాన్సర్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, స్టార్‌లైన్ చిల్డ్రన్ ఫౌండేషన్‌కు బాలిక సూచించింది.

17 స్టోరీస్( 17 Stories ) పుస్తక ప్రచురణ నిమిత్తం తల్లిదండ్రుల ఆర్ధిక సహాయంపై ఆధారపడకుండా ప్రత్యేక నిధుల సేకరణ ప్రయాణాన్ని చిన్నారి ప్రారంభించింది.ఇందుకోసం ప్లాస్టిక్, గాజు సీసాలు, రీసైక్లింగ్ కోసం శీతల పానియాల డబ్బాలను సేకరించడంతో పాటు పిగ్గీ బ్యాంక్‌లోని సొమ్మును ఉపయోగించింది.ఖేలా మీడియాతో మాట్లాడుతూ.17 స్టోరీస్‌లో ఫాంటసీ, మ్యాజిక్, మిత్, మిస్టరీ అనే నాలుగు ప్రధాన శైలులు వున్నాయని చెప్పింది.పుస్తకంలో సిడ్నీ పెరట్ నుంచి గుహలు, పర్వతాలు, గ్రామీణ పంజాబ్‌లోని మంత్రముగ్ధులను చేసే ప్రాంతాల వరకు ఊహాజనిత ప్రయాణానికి పాఠకులను ఆహ్వానిస్తున్నట్లు అష్లీన్ పేర్కొంది.

Advertisement

సామాజిక అన్యాయంతో పాటు భారతదేశంలో రోడ్డు పక్కన మురికివాడల్లో నివసించే నిరుపేద పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పుస్తకంలో ఆమె హైలైట్ చేసింది.అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలలో పిల్లల మధ్య జీవనశైలిలో వ్యత్యాసాన్ని వివరించే ఒక పదునైన కథగా ‘‘ఎలిసా అండ్ జోసెఫిన్’’ను పేర్కొంది.

మరోకథ ‘‘జోంబీ వైరస్ డైరీ ఎంట్రీ’’ ద్వారా కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆమె వ్యక్తిగత అనుభవాలను సృజనాత్మకంగా వివరించింది.ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి కుదరని సమయంలో ఓ ఆస్ట్రేలియన్ పిల్లవాడి అనుభవాలను ఇందులో అందించింది.ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రేరణ ఏంటని చిన్నారిని అడగా.

తాను భారత్‌లో చేసిన పర్యటనల నుంచి వచ్చిందని, అక్కడ సామాజిక అసమానతలను చూశానని పేర్కొంది.ఆస్ట్రేలియాలో స్థిరపడిన పంజాబీ ఎన్ఆర్ఐ అమర్‌జిత్ ఖేలా కుమార్తె అష్లీన్( Amarjit Khela ).సజవల్‌పూర్ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని చూసిన ఆమె తాను కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో నిరుపేద పిల్లల గురించి పాశ్చాత్య దేశాలలో అవగాహన పెంచడం, వారి అవసరాలకు మద్ధతుగా నిధులు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..
Advertisement

తాజా వార్తలు