త్వరలో నడిగూడెం వైద్యశాలకు 108 అంబులెన్స్:జలగం సుధీర్

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు త్వరలో 108 అంబులెన్స్ మంజూర్ చేస్తామని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ( Health Minister Harish Rao )తెలిపినట్లు ఎన్ఆర్ఐ జలగం సుధీర్బుధవారం వెల్లడించారు.

మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్న నడిగూడెం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రికి 24 గంటల వైద్య సదుపాయం కల్పించినప్పటికి 108 వాహానం లేకపోవటంతో ఆపద సమయాల్లో కోదాడ లేదా మునగాల నుండి 108 వాహానం( 108 vehicle ) రావటంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దయచేసి నడిగూడెం ఆసుపత్రికి ఒక 108 వాహానం మంజూర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు కి విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Latest Suryapet News