వైద్య విద్యార్థికి ఎస్పీ చేయూత

సూర్యాపేట జిల్లా:కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన నాగ సందీప్ అనే యువకుడు పెయింటింగ్ వర్క్ చేస్తూ చదువుకున్నాడు.

ఇతనికి కరీంనగర్ లో గల వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ వచ్చినది.

ఇతని యొక్క వైద్య విద్య యొక్క ఖర్చుల నిమిత్తం ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు.బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపినారు.

ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్య వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని,ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్పీ కోరారు.నాగ సందీప్ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసుకుని సహాయం అందించడంలో సహకరించిన మాస్ స్వచ్చంద సంస్థ ను ఎస్పీ అభినందించారు.

ఎస్పీ వెంట మాస్ స్వచ్చంద సంస్థ సిబ్బంది,జిల్లా కమ్యునికేషన్ ఎస్ఐ రాంబాబు ఉన్నారు.

Advertisement
సోషల్ మీడియాపై నిఘా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

Latest Suryapet News