వైఎస్ షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడి- బొల్లేపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

యాదాద్రి జిల్లా:వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రను బోల్లెపల్లిలో అడ్డుకోడానికి టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు.

ఫ్లెక్సీలు చింపివేసి,వైఎస్సార్ టిపి కార్యకర్తలపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.దీనితో తమపై అకారణంగా దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ టిపి శ్రేణులు బోల్లెపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

TRS Leaders Attack YS Sharmila's Pilgrimage - Tensions Rise In Bollepally Vi

అక్కడికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్ టిపి నాయకులకు నచ్చేజెప్పే ప్రయత్నం చేయగా,తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి,కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.

మూసికి పూడిక ముప్పు
Advertisement

తాజా వార్తలు