ఓపిఎస్ సాధన సంకల్ప రథయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ..!

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రం( Telangana State)లో సీపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ ఓపిఎస్ విధానాన్ని పునరుద్దరించాలనే డిమాండ్ తో ఈనెల16న జోగులాంబ గద్వాల జిల్లా( Jogulamba Gadwal ) నుండి ప్రారంభమయ్యే ఓపిఎస్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని టీఎస్ పీఆర్టీయూ పాలకవీడు మండల శాఖ అధ్యక్షుడు కొణతం వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

శనివారంమండల కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసిరథయాత్ర వాల్ పోస్టర్ నుఅవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక లక్ష 72 వేల మంది సీపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు మేలు జరిగే విధంగా భద్రత,భరోసా లేని సీపిఎస్ విధానాన్ని రద్దు చేసి,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.పాత పెన్షన్ సాధనే పీఆర్టీయూ టీఎస్ పంతమని,ఓపిఎస్ ప్రత్యామ్నాయ విధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ సీపిఎస్ ఇయు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ యూసుఫ్,పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ అధ్యక్షులు మాలోతు బాలు,ప్రధాన కార్యదర్శి గంధం ధర్మరాజు, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండా బాలకృష్ణ( Konda Balakrishna )సిపిఎస్ అధ్యక్షులు నాగరాజు, అనంత రెడ్డి,అంజయ్య, సంధ్య,తార,కవిత తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తుతోన్న ఎన్ఆర్ఐ పెట్టుబడులు .. త్రివేండ్రంలో రియల్ ఎస్టేట్ బూమ్
Advertisement

Latest Suryapet News