'నల్ల' కుబేరులకు మూడు నెలల గడువు

మేం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని నల్ల ధనం రప్పిస్తాం.

ఇదీ ఎన్నికల సమయంలో, అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ, భాజపా నాయకుల వాగ్దానం.

ఏడాది ఉత్సవాలు కూడా జరుపుకున్నారు.ఏమైంది? నాయకుల మాట నీటి మూటైంది.మూన్నాళ్ల ముచ్చటైంది.

ఇప్పుడు నల్లధనం వివరాలు చెప్పేందుకు ప్రభుత్వం నల్ల కుబేరులకు మరో మూడు నెలల సమయం ఇచ్చింది.అంటే ఈ ఏడాది సెప్టెంబరు ముప్పయ్యో తేదీ నాటికి వివరాలు తెలియచేయాల్సి ఉంటుంది.

గడువు లోగా వివరాలు చెప్పకపోతే కుబేరులపై భారీగా పెనాల్టీ విధిస్తారట.! నల్ల ధనానికి సంబంధించి చేసిన కొత్త చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది.

Advertisement

దాని ప్రకారం విపరీతమైన పెనాల్టీ వేస్తారు.క్రిమినల్‌ చర్యలు తీసుకొని పదేళ్ల జైలు శిక్ష కూడా వేస్తారు.

నల్ల డబ్బు ఎవరికి ఉంటుందో తెలుసు.కోటీశ్వరులు, శత కోటీశ్వరుల దగ్గర ఉంటుంది.

నల్ల డబ్బు దాచేవారు ఆ పని చాల జాగ్రత్తగా, ఎవ్వరికీ చిక్కకుండా చేస్తారు.వీరంతా రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, పెద్ద పరిశ్రమల అధిపతులు.

ఇలా ఉంటారు.వీరికి ప్రభుత్వంలోని పెద్దలతో మంచి సంబంధాలు ఉంటాయి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?

కొందరు ప్రభుత్వంలోనే ఉంటారు కూడా.వీరు నల్లధనం వివరాలు చెబుతారంటే నమ్మగలమా? చెప్పినా నిజాలు చెబుతారా? నల్ల డబ్బు వివరాలే తెలుసుకోలేని పాలకులు, నల్ల డబ్బును ఎలా రప్పిస్తారు? .

Advertisement

తాజా వార్తలు