గ‌జ్వేల్ నుంచి కేసీఆర్ అవుట్‌.. కొత్త కానిస్టెన్సీపై క‌న్ను..!

తెలంగాణ సీఎం కేసీఆర్ 2019 ఎన్నిక‌ల్లో కొత్త నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు టీ పాలిటిక్స్‌లో ఇన్న‌ర్‌గా టాక్ చ‌ర్చ‌కు వ‌స్తోంది.

కేసీఆర్ ఎమ్మెల్యేగా గతంలో సిద్ధిపేట నుంచి ప్రాథినిత్యం వ‌హించారు.

ఆ త‌ర్వాత ఆయ‌న కరీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, మెద‌క్ స్థానాల నుంచి ఎంపీగా కూడా గెలిచారు.గ‌త ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ప్ర‌స్తుతం సీఎంగా ఉన్నారు.

ఇక ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ఎన్డీయే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కోరుతున్న‌ట్టుగానే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేసేయాల‌ని మోడీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

జూలై నెలాఖ‌రునుంచే ఈ విభ‌జ‌న ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతోంద‌ని స‌మాచారం.నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే యాదాద్రి జిల్లా కేంద్రంగా కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డ‌నుంది.

Advertisement

ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రంగా ఉండి, ఇటీవ‌లే జిల్లా కేంద్రంగా మారిన యాదాద్రి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే నియోజ‌క‌వ‌ర్గం కాబోతుంది.ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ 2019లో ఇక్క‌డ నుంచి పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

పున‌ర్విభ‌జ‌న‌తో ప్రస్తుతం తెలంగాణ‌లో ఉన్న 119 నియోజ‌క‌వ‌ర్గాలు 153కు పెర‌గ‌నున్నాయి.ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న 7 ఎంపీ స్థానాలు 9 కానున్నాయి.

ఏదేమైనా కేసీఆర్ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు ఎమ్మెల్యేలుగా ఉన్న పాత న‌ల్గొండ జిల్లా నుంచి బ‌రిలోకి దిగుతున్నారు.దీంతో ఈ ఎఫెక్ట్ వారి నియోజ‌క‌వ‌ర్గాల‌పై కూడా ప‌డ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం: నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ .. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ అంటే ?
Advertisement

తాజా వార్తలు