తెలంగాణలో ఒంటరి పోరుకు సిద్ధమైన వైఎస్ఆర్‎టీపీ..!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వైఎస్ఆర్‎టీపీ సిద్ధం అవుతోందని తెలుస్తోంది.

ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల కార్యాచరణను ప్రకటించనున్నారని సమాచారం.

ఈనెల 12 వ తేదీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆరుగురు సభ్యులతో ప్రత్యేక మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు.కాగా ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ, రేపు పార్టీ కార్యకర్తలతో షర్మిల కీలక సమావేశాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే షర్మిల త్వరలోనే పాలేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు