ఒక్కో విగ్‌ తయారీకి ఎంత టైం ప‌డుతుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

ఇటీవ‌లి కాలంలో బట్టతల సమస్య పెరుగుతుండడంతో తలపై ఫేక్ హెయిర్ అప్లై చేసే ట్రెండ్ కూడా వేగంగా పెరుగుతోంది.

విగ్ తయారీలో ఎక్కువ భాగం చేతితో జరుగుతుందని, అందువల్ల దీని త‌యారీకి చాలా సమయం పడుతుందని ఇన్‌సైడర్ నివేదిక చెబుతోంది.

ఒక విగ్ త‌యారీకి 50 గంటల నుండి 6 నెలల వరకు పట్టవచ్చు.విగ్‌ను రెండు విధాలుగా తయారు చేస్తారు.

మొద‌టిది కృత్రిమంగా తయారుచేసే పాలిస్టర్ జుట్టు.రెండ‌వ‌ది మనిషి వెంట్రుకలతో తయారు చేసే విగ్.

రెండ‌వ ర‌కం విగ్ ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.ఇది పూర్తిగా స‌హ‌జ‌ రూపాన్ని కలిగి ఉండటం వలన వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ధర కూడా ఎక్కువగా ఉంటుంది.దీన్ని ఎలా సిద్ధం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నిషి జుట్టును సేక‌రించాక దానిని నీటిలో కడుగుతారు.దానిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తొల‌గిపోతుంది.

తరువాత రంగు మరియు పరిమాణం గుర్తిస్తారు.ఇప్పుడు అత్యంత కష్టతరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది.

30 వేల నుంచి 40 వేల నాట్లుతో విగ్గును రూపొందిస్తారు.పొట్టి జుట్టు గల విగ్‌లు పురుషుల కోసం తయారు చేస్తారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

మహిళలకు విగ్‌లను తయారు చేయడానికి, జుట్టు కనీసం 8 అంగుళాల పొడవు ఉండాలి.ఇంత‌క‌న్నా విగ్‌ పొట్టిగా ఉంటే ఆ వెంట్రుకలకు కొత్త రూపాన్ని ఇవ్వడం చాలా కష్టం అవుతుంది.

Advertisement
" autoplay>

తాజా వార్తలు