వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాక్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాక్ అయింది.అర్ధరాత్రి సమయంలో సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసినట్లు సమాచారం.

ఈ క్రమంలో ప్రొఫైల్ పిక్, కవర్ పిక్ లను హ్యాకర్లు మార్చేశారు.గమనించిన వైసీపీ ఐటీ సిబ్బంది ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారు.

అదేవిధంగా లోకేషన్ యూఎస్‌ఏ ఉన్నట్లు చూపిస్తోంది.హ్యాకర్లు రాత్రి నుంచి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తుండడంతో నెటిజన్లకు అర్థం కాలేదు.

అధికారంలో ఉన్న పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేయడం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు