Yatra 2 First Day Collections : యాత్ర2 ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రూ.కోట్లు వచ్చాయంటే?

ఏపీ సీఎం వైఎస్ జగన్( YS Jagan ) బయోపిక్ గా తెరకెక్కిన యాత్ర 2( Yatra 2 ) సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

దర్శకుడు మహి వి రాఘవ్( Mahi V Raghav ) జగన్ జీవితానికి సంబంధించి తెలిసిన విషయాలతో పాటు తెలియని అంశాలను సైతం సినిమాలో ప్రస్తావించారు.

యాత్ర 2 క్లైమాక్స్ లో కొన్ని సెకన్ల పాటు సీఎం జగన్ స్క్రీన్ పై కనిపించడం సినిమా చూసిన ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని కలిగించింది.ఈ సినిమా చూసి కొంతమంది ఎమోషనల్ అయిన వీడియోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయి.

అయితే ఈ సినిమా ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్లను సాధించింది.ఈ సినిమాకు 11 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగిందని కోటీ 65 లక్షల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా సాధించిందని తెలుస్తోంది.

లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Yatra2 Movie First Day Collections Details Here Goes Viral In Social Media
Advertisement
Yatra2 Movie First Day Collections Details Here Goes Viral In Social Media-Yatr

హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈరోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు.ఈరోజు ఈగల్ సినిమా( Eagle Movie ) భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలైనా ఈగల్, యాత్ర2 జానర్లు వేర్వేరు కావడంతో ఏ సినిమా కలెక్షన్లు ఆ సినిమాకు వస్తాయని చెప్పవచ్చు.

మమ్ముట్టి( Mammootty ) వైఎస్సార్ పాత్రలో జీవా( Jiiva ) వైఎస్సార్ కొడుకు జగన్ పాత్రలో జీవించారు.

Yatra2 Movie First Day Collections Details Here Goes Viral In Social Media

యాత్ర 2 సినిమాను మహి వి రాఘవ్ అద్భుతంగా తెరకెక్కించారనే చెప్పాలి.క్లీన్ యూ సర్టిఫికెట్ తో రిలీజైన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యాత్ర2 సినిమాకు టాక్ పాజిటివ్ గా ఉండగా ఈరోజు విడుదలైన లాల్ సలాం సినిమాకు మాత్రం ఆశించిన టాక్ రాలేదు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు