సాధారణంగా వరుసగా రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే ఏ హీరో అయినా వేగంగా సినిమాలు చేసి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకుంటారనే సంగతి తెలిసిందే.అయితే యశ్ మాత్రం నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు.
కేజీఎఫ్2( KGF2 ) బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్( yash ) ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు.భారీ క్యాస్టింగ్ తో, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
గత కొంతకాలంగా నితీష్ తివారి ( Nitish Tiwari )డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామాయణం( Ramayanam ) ప్రాజెక్ట్ లో యశ్ నటిస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఈ వార్తల గురించి యశ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తన సొంత బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనుందని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ గురించి యశ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాకు ఎప్పటినుంచో మన భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై ఉంచాలనేది కల అని వెల్లడించారు.నేను, నమిత్ మల్హోత్ర( Namit Malhotra ) రామాయణం ప్రాజెక్ట్ ను నిర్మించాలని చాలాసార్లు అనుకున్నామని చెప్పుకొచ్చారు.అంత పెద్ద ప్రాజెక్ట్ కావాలంటే భారీ సైజ్ లో ఖర్చు అవుతుందని అందుకే నేను ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం అయ్యానని యశ్ పేర్కొన్నారు.
రామాయణానికి నా మనస్సులో మంచి స్థానం ఉందని యశ్ తెలిపారు.
రామాయణం కోసం నేను ఎంతైనా కష్టపడతానని యశ్ చెప్పుకొచ్చారు.నితీష్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందని ఆయన అన్నారు.యశ్ నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
యశ్ ఈ సినిమాలో ఎలాంటి రోల్ లో కనిపిస్తారో చూడాల్సి ఉంది.యశ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy