స్మార్ట్ బల్బ్ ని ఇండియాలో విడుదల చేసిన షియోమీ సంస్థ ...!

తాజాగా చైనా దేశ కంపెనీ షియోమి నేడు భారతీయ మార్కెట్లో తన కొత్త బల్బు మోడల్ ని విడుదల చేసింది.

ఎంఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ b22 మోడల్ ని నేడు భారత్ లో విడుదల చేసింది.

ఈ బల్బ్ విశేషాల్లోకి వస్తే ఇది 9 వాట్స్ విద్యుత్తును వినియోగించుకుంటూ 900 లుమెన్స్ స్థాయిలో మనకు అందజేస్తుంది.ఇది మామూలుగా మనం వాడే బల్బు లాగానే సాకెట్ కలిగి ఉండటంతో మన ఇంట్లోని ఏ బల్బు హోల్డర్ కైనా అడ్జస్ట్ అయ్యే విధంగా సులభంగా దీనిని కనెక్ట్ చేసుకోవచ్చు.

ఇక ఈ స్మార్ట్ బల్బును మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్స లాంటి స్మార్ట్ అసిస్టెంట్ వాటి సహాయంతో వాయిస్ కమాండ్స్ జారీ చేసి ఈ బల్బును కంట్రోల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.ఈ స్మార్ట్ బల్బు ద్వారా మీరు ఏ సమయంలో కావాలని అనుకుంటే ఆ సమయంలో ఆన్ అవ్వడం, ఏ సమయంలో వద్దనుకుంటే ఆ సమయంలో ఆఫ్ అవ్వడం లాంటి సదుపాయం ఇందులో ఉంది.

ఇలాంటి సదుపాయాన్ని స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా షెడ్యూల్ చేసుకునే వెసులుబాటు ఉంది.మన ఫోన్స్ లో ప్రీ ఇన్స్టాల్ గా ఉండే మై హోమ్ అప్లికేషన్ ద్వారా ఈ స్మార్ట్ బల్బును కనెక్ట్ చేసుకొని వాయిస్ కమాండ్స్ ద్వారా వాటిని ఆపరేట్ చేసుకోవచ్చు.

Advertisement

ఇక ఈ స్మార్ట్ బల్బ్ ఏకంగా 16 మిలియన్ల రంగులను సపోర్ట్ చేయగలుగుతుంది.ఇక ఈ బల్బు 1700 k - 6500 k వరకు ఉన్న టెంపరేచర్ కు సపోర్ట్ చేస్తుంది.

ఇక దీని జీవితకాలం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.ఇది ఏకంగా 25 వేల గంటల పాటు కాంతిని ఇవ్వగలదు.

దీనిని నెలల ప్రకారం చూస్తే.ఏకంగా 11 సంవత్సరాల పాటు తన జీవితకాలాన్ని మనకు అందిస్తుంది.

అయితే రోజుకి కేవలం ఆరు గంటల పాటు మాత్రమే ఉపయోగిస్తే ఈ జీవితకాలం లభిస్తుందని సంస్థ అంచనా వేస్తోంది.ఈ స్మార్ట్ బల్బును ప్రజలు mi.com లో పొందవచ్చు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

ఇక ఈ బల్బు మనకు 799 రూపాయలకు లభిస్తుంది.ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరలో ఎక్కువ మన్నిక, అది కూడా టెక్నాలజీ ఉపయోగకరంగా ఉండే స్మార్ట్ బల్బ్.

Advertisement

తాజా వార్తలు