Shanmukh Jaswanth : ఇంట్లో ఉంటే షణ్ముఖ్ అల్లరి ఇలా ఉంటుందా.. ఏకంగా వీల్ చైర్ లో కూర్చునే పరిస్థితి?

షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక యూట్యూబ్ స్టార్ గా ఎంత పేరు సంపాదించుకున్నాడో.

పర్సనల్ విషయంలో అంత హాట్ టాపిక్ గా మారాడు.ఎప్పుడైతే దీప్తి సునైన బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు షణ్ముఖ్( Shanmukh Jaswanth ) గురించి టాపిక్ తీసిందో అప్పటి నుంచి షణ్ముఖ్ అందరి దృష్టిలో పడ్డాడు.

ఇక ఇతడు యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ మరింత పరిచయాన్ని పెంచుకున్నాడు.మొదట్లో దీప్తి సునైనతో కలిసి చాలా వీడియోస్ చేశాడు.

అతి తక్కువ సమయంలో యూట్యూబ్ స్టార్ గా మారాడు.ఇక అదే సమయంలో దీప్తి సునైనతో ప్రేమలో పడగా ఇద్దరు కొంతకాలం ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచారు.

Advertisement

ఇక షణ్ముఖ్ కూడా తన వీడియోస్ తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక దీప్తి ఫ్యాన్స్ కూడా షన్ను కు ఫ్యాన్స్ గా మారారు.

ఇక ఇద్దరు కలిసి బుల్లితెరపై పలు షోలల్లో పాల్గొని బాగా సందడి చేశారు.ఆ తర్వాత షన్నుకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో మరో కంటెస్టెంట్ సిరి తో ఇతడు కాస్త మితిమీరి ప్రవర్తించడంతో దీప్తి అతనికి బ్రేకప్ చెప్పేసి అప్పటినుంచి తన లైఫ్ ఏంటో తాను చూసుకుంటుంది.

ఇక షన్ను కూడా దీప్తిని వదులుకోలేకపోయాడు.ఆ తర్వాత తనకు కూడా ఒంటరిగా ఉండటం అలవాటయింది.ఇక ఎప్పటిలాగే కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.

మంచి మంచి సక్సెస్ లు అందుకుంటూ ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం మరో సీరిస్ లో బిజీగా ఉన్నాడు.ఇక సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా కనిపిస్తూ నిత్యం ఏదో ఒక ఫోటోను, తన డాన్స్ వీడియోలను బాగా పంచుకుంటూ ఉంటాడు.అప్పుడప్పుడు బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటాడు.

Advertisement

ఇక ఇప్పటికీ దీప్తిని కలవమని ఈయనకు సలహాలు ఇస్తూ ఉంటారు.షన్ను కూడా దీప్తిని కలవడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాడు.

ఆ మధ్య దీప్తి బర్త్డే రోజు కూడా స్టోరీ రూపంలో తనకు విష్ చేశాడు.కానీ దీప్తి( Deepthi Sunaina ) మాత్రం పట్టించుకోనట్లు కనిపించింది.ఇక ఇదంతా పక్కన పెడితే అప్పుడప్పుడు సరదాగా గడిపిన వీడియోస్ కూడా పంచుకుంటూ ఉంటాడు.

అయితే తాజాగా తను తన ఇన్స్టా లో ఒక స్టోరీ పంచుకున్నాడు.అందులో తను తన తాతయ్య కోసం వీల్ చైర్ తీసుకొని రాగా దాంట్లో కాసేపు కూర్చొని సరదాగా ఆడుకుంటూ కనిపించాడు.

తను ఇంట్లో ఉంటే చిన్నపిల్లలాగా అల్లరి చేస్తుంటానని చెప్పుకొచ్చాడు.మొత్తానికి ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.అది చూసి తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

ఇక కొంతమంది హేటర్స్ ఎప్పటిలాగే ట్రోల్ చేస్తున్నారు.

https://instagram.com/stories/shannu_7/3119756240159324427?igshid=NzJjY2FjNWJiZg==

తాజా వార్తలు