నరక చతుర్దశి రోజు శ్రీకృష్ణ భగవంతున్ని ఇలా పూజించండి..!

ముఖ్యంగా చెప్పాలంటే నకర చతుర్దశిని ( Nakara Chaturdashi )సనాతన ధర్మంలో ఎంతో ముఖ్యమైనది గా భావిస్తారు.

ఈ సంవత్సరం నకరా చతుర్దశిని కార్తిక మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుపుకొనున్నారు.

ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.చెడు పై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నకరా చతుర్దశి జరుపుకుంటారు.

అందుకే ఈ పవిత్రమైన రోజును శ్రీకృష్ణుడిని నిష్టగా పూజిస్తారు.అంతే కాకుండా ఈ రోజు చాలా మంది ఎన్నో మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేస్తారు.

ఈ రోజు దేవుళ్లను పూజించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.అలాగే చతుర్దశి తిధి ప్రారంభం నవంబర్ 11వ తేదీన మధ్యాహ్నం ఒకటి 57 నిమిషముల నుంచి నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం రెండు 27 నిమిషముల వరకు ఉంటుంది.

Advertisement

సనతన ధర్మంలో నకరా చతుర్దశికి ఎంతో విశిష్టత ఉంది.ఈ పండుగ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నకరసురుడు అనే రాక్షసుల్ని సంహరించి 16,000 మంది గోపికలను రక్షించాడు.

అందుకే చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతికగా ఈ నకరా చతుర్దశినీ జరుపుకుంటారు.ఈ పవిత్రమైన రోజు శ్రీకృష్ణుని పూజిస్తారు.అలాగే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే,కృష్ణయ్ వాసుదేవాయ హరయే పరమాత్మే.

ప్రాణాత్ కాష్ణాయ గోవిందాయ నమో నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తారు.

అలాగే నకర చతుర్దశి ( Nakara Chaturdashi )రోజు ప్రజలు తమ ఇంటిని శుభ్రం చేసి పూలు, దీపాలు ఇతర అలంకరణ సామాగ్రితో అందంగా ముస్తాబు చేస్తారు.అలాగే శ్రీకృష్ణుడి ముందు దీపం వెలిగించి ఖీర్, హల్వా, డ్రై ఫ్రూట్స్( Dry fruits ), స్వీట్లు సమర్పిస్తారు.చివరిగా గోపాలుడి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం వేళ ఇంట్లో 11 మట్టి దీపాలను వెలిగించాలని నిపుణులు చెబుతున్నారు.

మహిళలు ఏ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్లాలో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు