వైరల్ - అమెరికాలో ఏనుగు టూత్ పేస్ట్

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు యువకులు విభిన్నంగా ఏదో ఒక పని చేయడం దానిని యూట్యూబ్ లో పెట్టడం అలవాటుగా మారింది.

వారి వీదియోలకి మాంచి స్పందన కూడా వస్తూ ఉంటుంది.

కొట్లలో ఫాలోవర్స్ కూడా వారికి ఉన్నారు.అయితే వారు ఈ సారి కొంచం విభిన్నంగా వారి వీడియో ఉండాలని అనుకున్నారు.

అనుకున్నదే తడవుగా ఓ వెరైటీ ప్రయోగం చేశారు.దాంతో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

టూత్ పేస్ట్ లు అందరికి ఉంటాయి కానీ ఏనుగు కోసం కూడా టూత్ పేస్టు ఉండాలి కదా ఇది మేము తయారుచేస్తున్నాం అంటూ తమ ఇంటి వెనుక ఉన్న చిన్నపాటి ఖాళి స్థలంలో కృత్రిమంగా వోల్కనో ని సృష్టించారు.కొన్ని రసాయనిక పదార్ధాలని కలిపితే లావా లాంటి ఫోమ్ ఒకటి ఓ డోమ్ నుంచీ లావాలా బయటికి వచ్చేలా చేశారు.

Advertisement

అందులో పొటాషియం అయోడైద్ తో మరింత హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నీలి రంగు ఫోమ్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు.

దీనికి సరదాగా వాళ్ళు ఏనుగు టూత్ పేస్ట్ అని పేరుపెట్టారు.ఈ వీడియో పుటేజ్ పెట్ట్టీ పెట్టగానే పది లక్షల మంది చూసి ఆశ్చర్యపోయారు.అందుకు తగ్గట్లుగా కామెంట్స్ కూడా చేశారు.

ఈ వీడియో లో కొసమెరపు ఏమిటంటే ఆక్సిజన్ గ్యాస్ ని ఈ మిశ్రమంలోకి పంపగానే ఒక్క సారిగా పేలుడు శబ్దం రావడంతో అక్కడి నుంచీ అందరూ పరుగులు తీశారు.

సిక్కు కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోడీది బలమైన బంధం : ఇండో అమెరికన్ నేత
Advertisement

తాజా వార్తలు