కోకో పౌడ‌ర్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా.. తెలుసుకోక‌పోతే చాలా న‌ష్ట‌పోతారు..?

చాక్లెట్స్, కేక్స్ తయారీలో ఉపయోగించే మెయిన్ ఇంగ్రీడియంట్ కోకో పౌడర్.కోకో గింజల నుంచి కోకో పౌడర్ ను తయారు చేస్తారు.

ప్ర‌త్యేక‌మైన ఫ్లేవ‌ర్ ను క‌లిగి ఉండే కోకో పౌడ‌ర్ రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యమైనది కూడా.కోకో పౌడర్( Cocoa powder ) లో కాలుష్యం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

అందువల్ల కోకో పౌడర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అసలు కోకో పౌడర్ వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు.

అధిక ర‌క్త‌పోటు( High Blood Pressure )తో భాద‌ప‌డేవారికి కోకో పౌడ‌ర్ న్యాచుర‌ల్ మెడిసిన్ లాగా ప‌ని చేస్తుంది.కోకో పౌడ‌ర్‌లోని ఫ్లేవనోల్స్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.

Advertisement
Wonderful Health Benefits Of Cocoa Powder! Cocoa Powder, Cocoa Powder Benefits,

దాంతో మీ రక్తనాళాల పనితీరును పెరిగి అధిక రక్తపోటు స‌మ‌స్య దూరం అవుతుంది.అలాగే కోకో పౌడ‌ర్ గుండెకు అండంగా ఉంటుంది.

బ్యాడ్ కొలెస్ట్రాల్ ను క‌లిగి గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే రిస్క్ ను త‌గ్గిస్తుంది.

Wonderful Health Benefits Of Cocoa Powder Cocoa Powder, Cocoa Powder Benefits,

ఒత్తిడి, డిప్రెష‌న్ స‌మ‌స్య‌ల‌ను చిత్తు చేయ‌డానికి కూడా కోకో పౌడ‌ర్ హెల్ప్ చేస్తుంది.కోకో పౌడ‌ర్ లో ఉండే ప‌లు సమ్మేళనాలు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.మెద‌డు రెట్టింపు వేగంగా ప‌ని చేసేలా ప్రోత్స‌హిస్తుంది.

మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా కోకో పౌడ‌ర్ ను తీసుకోవ‌చ్చు.ఎందుకంటే, కోకోలో ఉండే ఫ్లేవనాయిడ్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Wonderful Health Benefits Of Cocoa Powder Cocoa Powder, Cocoa Powder Benefits,
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

అంతేకాదు, కోకో పౌడ‌ర్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎల్ల‌ప్పుడూ ఎంతో ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.ప‌లు దీర్ఘ‌కాలిక వ్యాధులు ద‌రిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ( Immunity Power )పెరుగుతుంది.

Advertisement

చ‌ర్మం కూడా నిగారింపుగా, కాంతివంతంగా మెరుస్తుంది.ఇక కోకో పౌడ‌ర్ ను ఎలా తీసుకోవ‌చ్చు అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.

కోకో పౌడ‌ర్ ను మీరు పాలు లేదా పెరుగులో క‌లిపి తీసుకోవచ్చు.స్మూతీల‌తో జోడించ‌వ‌చ్చు.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ లో ఓట్మీల్ లో కూడా కోకో పౌడ‌ర్ ను యాడ్ చేసుకోవ‌చ్చు.

తాజా వార్తలు