వీధి కుక్కల వీరంగం మహిళలకు తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్, బాలాజీ నగర్( Sriramnagar, Balaji Nagar ) కాలనీల్లో ఆదివారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి.

కుక్కల దాడిలో శ్రీరాంనగర్ కు చెందిన మహిళకు తీవ్ర గాయాలు కాగా,బాలాజీ నగర్ లో మరో ఇద్దరు మహిళలను గాయపరిచాయి.

వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ కుక్కలతో బయటకు రావాలంటే వార్డు ప్రజలు బెంబేలెత్తుతున్నారని,గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకొని రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News