షర్మిల సపోర్ట్ కాంగ్రెస్ కు ఉంటుందా ?

వైఎస్ షర్మిల ( YS Sharmila )సపోర్ట్ కాంగ్రెస్ కు ఉంటుందా ? ప్రస్తుతం ఏపీ ప్రశ్న అటు తెలంగాణలోనూ( Telangana ) ఇటు ఏపీలో ను హాట్ టాపిక్ అయింది.ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ ను బలపరిచేందుకు హస్తం హైకమాండ్ షర్మిలను రంగంలోకి దించబోతుందని ? అందుకోసం ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారని.

? ప్రియాంక ప్రతిపాదనకు షర్మిల కూడా సుముఖంగానే ఉన్నారని ఇలా రకరకాలుగా వార్తలు చక్కరు కొడుతున్నాయి.ఈ వార్తలు ఇంతలా వైరల్ కావడానికి కారణం కూడా లేకపోలేదు.

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి డీకే శివకుమార్ ( DK Sivakumar )తో షర్మిలా భేటీ అయ్యి స్పెషల్ విషస్ తెలిపారు.దీంతో అప్పటి నుంచి ఈ రకమైన వార్తాలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో డీకే శివకుమార్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఆ కారణంగానే డీకేతో షర్మిల భేటీ అయినట్లు కొందరి వాదన.ఇదిలా ఉంచితే కర్నాటక విజయం ఇచ్చిన జోష్ తో రెండు తెలుగు రాష్ట్రల్లో పునర్వైభవం పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది.అయితే తెలంగాణలో కాంగ్రెస్ కొంత బలంగా ఉన్నప్పటికి ఏపీలో మాత్రం కాంగ్రెస్ ఉనికే కోల్పోయింది.

Advertisement

ఈ నేపథ్యంలో ఏపీలో బలపడాలంటే సరైన నాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.ఇక్కడ వైఎస్ జగన్ ( YS Jagan )ను ఢీ కొట్టాలంటే ఒక్క షర్మిలతోనే సాధ్యం అని భావిస్తోందట.

అందుకే షర్మిలను ఎట్టి పరిస్థితిలో ఏపీ కాంగ్రెస్ తరుపున బరిలో నిలిపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుండట.అయితే ప్రస్తుతం షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ( YSR Telangana Party ) పెట్టి ఇక్కడ రాజకీయంగా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు.

అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రతిపాదనను షర్మిల ముందు ఉంచిందట హస్తం అధిష్టానం.ఇదంతా కూడా ప్రియాంక గాంధీ చొరవతోనే జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అయితే ఏపీలో జగన్ తో ఉన్న విభేదాల కారణంగా తెలంగాణకు కొత్త పార్టీ పెట్టిన షర్మిల ఎప్పుడు మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి వస్తుందా ? అంటే కష్టమనే సమాధానం వినిపిస్తోంది.అంతే కాకుండా తెలంగాణలో కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ కు షర్మిల సపోర్ట్ ఉంటుందా అంటే కూడా చెప్పడం కష్టమే.అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం కారణంగా షర్మిల సపోర్ట్ కాంగ్రెస్ కు లభించిన ఆశ్చర్యం లేదనేది మరికొందరి వాదన.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు