'ఆర్‌ఆర్‌ఆర్‌' స్టార్స్ కి జాతీయ అవార్డ్ రాకపోవడంకు కారణం..?

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్‌( Allu Arjun ) సత్తా చాటాడు.

ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఏ ఒక్కరికి దక్కని ఉత్తమ నటుడు అవార్డ్‌ అల్లు అర్జున్ కి దక్కడంతో అభిమానులతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.

మొదటి సారి తెలుగు స్టార్‌ కి ఉత్తమ నటుడు అవార్డు రావడం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో జాతీయ అవార్డులు అందుకున్న జాబితాలో తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి.

Why Rrr Heroes Ram Charan And Ntr Not Get National Film Awards 2023, Rrr Heroes

అయినా కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ల పేర్లు లేకపోవడం చాలా మందికి షాకింగ్ గా ఉంది.ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరు కూడా ఉత్తమ నటులుగా అవార్డును సొంతం చేసుకుంటారు అని అనుకున్నారు.కానీ అనూహ్యంగా ఆ ఇద్దరు కాకుండా మూడవ వ్యక్తి అయిన అల్లు అర్జున్ కి అవార్డు దక్కడం షాకింగ్ గా ఉందని నందమూరి అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

మెగా వర్సెస్‌ నందమూరి అన్నట్లుగా గత రెండు రోజులుగా ఫ్యాన్స్ వార్‌ జరుగుతుంది.

Why Rrr Heroes Ram Charan And Ntr Not Get National Film Awards 2023, Rrr Heroes
Advertisement
Why RRR Heroes Ram Charan And NTR Not Get National Film Awards 2023, RRR Heroes

ఎన్టీఆర్( Jr ntr ) కి వస్తుందని కొందరు అంటే చరణ్‌( Ram charan ) కి వస్తుందని కొందరు వాదించారు.చివరికి జాతీయ అవార్డును అల్లు అర్జున్‌ ఎగురవేసుకు పోయాడు.ఇక ఆర్ఆర్ఆర్ స్టార్స్ కి ఉత్తమ నటుడు అవార్డు రాకపోవడంకు గల కారణం స్క్రీన్‌ ప్రజెన్స్‌ అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.

అంటే ఇద్దరు హీరోలు ఉండటం వల్ల సినిమాల్ వారు కనిపించేది కొద్ది సమయం మాత్రమే.అంటే అల్లు అర్జున్ సినిమా మొత్తం కూడా కనిపించి సందడి చేసి, నటుడిగా తన సత్తా చాటుకోగా, రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు సినిమా లో స్క్రీన్‌ స్పేస్ ను పంచుకున్నారు.

అందుకే బన్నీ కి జాతీయ అవార్డు దక్కి ఉంటుంది.చరణ్‌, ఎన్టీఆర్ లు సోలోగా నటించక పోవడం వల్ల అవార్డు రాకపోయి ఉంటుంది అనేది కొందరి వాదన.

అసలు విషయం ఏంటి అనేది ఆ జాతీయ అవార్డులు ప్రకటించిన జ్యూరీకే తెలియాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు