సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు?

ప్రతిరోజూ ఉదయమే ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గు పెట్టడం మనం సంప్రదాయం.

కొన్ని చోట్ల ప్రతి రోజూ కాకపోయినప్పటికీ వారంలో ఏవో కొన్ని రోజుల్లో తప్పనిసరిగా ముగ్గులు పెడతారు.

అందులోనూ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు.ఇందుకు ముఖ్య కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంపదకి అధిదేవత లక్ష్మీదేవత.లక్ష్మీ దేవి ప్రతి రోజు ఉదయం ఇంటి ముందుకు వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అలా లక్ష్మీ దేవి ఇంటి ముందుకు వచ్చినప్పుడు… ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి, కళ్లాపి జల్లి, ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంటికి లక్ష్మీ దేవి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.ఇంట్లోకి వచ్చిన అమ్మవారు సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలను, ధన ధాన్యాలను, సుఖ శాంతులను తీసుకొస్తుందని ప్రాశస్తి.

Advertisement
Why Do Put Muggu Infront Of Home On Sankranthi, Muggu, Sankranthi , Lakshmi Dev

అందుకే తెల్లవారు జామున ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించాలని అంటారు.అందుకే పండుగల రోజు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు.

వీటినే రంగవళ్లులు అని కూడా పిలుస్తారు.వివిధ రకాల రంగులతో ఇంటి ముందు ముగ్గులు పెట్టడం ఓ కళ.వీటిపై గొబ్బెమ్మలు పెడుతూ.పూలు కూడా ఉంచుతారు.

ఇదంతా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకే.అర్చనకు, ధ్యానానికి, యోగానికి అనువైన సమయం సంక్రాంతి.

అందుకే ఈ రోజు లక్ష్మీదేవి కసం ప్రత్యేకమైన ముగ్గులు వేస్తుంటారు.

Why Do Put Muggu Infront Of Home On Sankranthi, Muggu, Sankranthi , Lakshmi Dev
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్17, గురువారం 2025

అంతే కాకుండా ఇంటి ముందు కళ్లాపి జల్లి ముగ్గు పిండితో ముగ్గు వేస్తే.ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటికాలు రావు అనేది సైటింఫిక్ రీజన్.అలాగే ముగ్గు వేస్తున్నంత సేపు పైకి కిందకూ వంగుతూ ఉండాలి.

Advertisement

అలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.కారణం ఏదైనప్పటికీ ఇంటి ముందు ముగ్గు పెట్టడం వల్ల మంచే జరుగుతుంది.

అందుకు ప్రతిరోజూ లేదా వారంలో ఏదో రోజు కచ్చితంగా ముగ్గు పెట్టాలి.

తాజా వార్తలు