జనసేనను పవన్ ఎందుకు పెట్టారు..: మంత్రి రోజా

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రం కోసం ఎన్డీఏ మీటింగ్ లో ఏం అడుగుతారంటే తనకు అనుభవం లేదు, మనోహర్ చెప్తారని పవన్ అన్నారన్నారు.

మరి జనసేనను పవన్ కల్యాణ్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.చంద్రబాబుతో కలవద్దని చిరంజీవి చెప్పినందుకే తమ అధికార ప్రతినిధితో తిట్టించారని పేర్కొన్నారు.

రాజకీయ, సినిమా భిక్ష పెట్టిన అన్న అంటే కూడా గౌరవం లేదని మండిపడ్డారు.ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

సినిమాల్లో పవన్ హీరో కావచ్చన్న రోజా రాజకీయాల్లో మాత్రం జీరో అని ఎద్దేవా చేశారు.సీఎం జగన్ ను అనే అర్హత జనసేన నేతలకు లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Advertisement
తండేల్ సినిమాతో నాగ చైతన్య పాన్ ఐడియా హీరోగా ఏడుగుతాడా..?

తాజా వార్తలు