నీకు ఇలాంటివి అవసరమా అనుపమ..!

మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తన చేజేతులారా కెరియర్ పాడుచేసుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

సోలో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్స్ ఉన్న ఈ అమ్మడు యువ హీరోలతో నటిస్తూ తన ఇమేజ్ ని తానే తగ్గించుకుంటుంది.

ఇక లేటెస్ట్ గా నాని నటించిన అంటే సుందరానికీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది అనుపమ.స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్న అనుపమని అంటే సుందరానికీ లాంటి సినిమాలో అది కూడా చాలా చిన్న పాత్రలో చూసి ఆమె ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు.

ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూ అంటే సుందరానికీ లాంటి సినిమాలు నీకు అవసరమా అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు.అంటే సుందరానికీ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

అయితే ఆ హిట్ అనుపమ ఖాతాలో ఏమాత్రం పడదు.అంతేకాదు అసలు అనుపమ పరమేశ్వరన్ చేయాల్సిన పాత్ర కూడా కాదని అంటున్నారు.

Advertisement

నానితో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన అనుపమ అంటే సుందరానికీ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసింది.మరి అనుపమ తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల ఆమె కెరియర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక మీదట అయినా అనుపమ ఇలాంటి పాత్రలు చేయకుండా ఉంటే బెటర్ అని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు