ఎవరు ఈ కమాల్ రషీద్ ఖాన్ .. ఇతడి స్థాయి ఏపాటిది ?

కమాల్ రషీద్ ఖాన్.ప్రస్తుతం ఇండియాలోనే ట్రేండింగ్ లో ఉన్న వ్యక్తి.

బాలీవుడ్ పెద్దలతో పెట్టుకోవడం అంటే ఈ మనిషికి మహా సరదా.సల్మాన్ ఖాన్ తో లీగల్ గా ఫైట్ జరుగుతూనే ఉంది.

మొదటి నుంచి ఈయనకు వివాదాలు అంటే మహా ప్రీతీ.తొలుత బిగ్ బాస్ లో పాల్గొన్నాడు.

ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించాడు.కేవలం కొన్ని సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి బిగ్ బాస్ ఉపయోగ పడింది కానీ అతడిని రావాల్సిన పబ్లిసిటీ మాత్రం రాలేదు.

Advertisement
Who Is This Kamaal Rashid Khan , Kamaal Rashid Khan , Bollywood ,Salman Khan, Bi

ఆ తర్వాత హిందీ మరియు భోజపురి కొన్ని సినిమాలకు దర్శకత్వం చేసాడు, నిర్మాతగా కూడా అవతారం ఎత్తాడు.బాగానే డబ్బు కూడా బెట్టాడు.

రివ్యూ పేరు చెప్పుకొని హిందీ పరిశ్రమను బ్రష్టు పట్టించేసాడు.ట్విట్టర్ లో క్రేజీ ఫాల్లోవింగ్ సంపాదించుకొని తనకు తాను మంచి సినిమాలను టార్గెట్ చేస్తూ బురద జల్లడం వంటివి చేసాడు, ఇతడు ఇచ్చే ఒక్క రివ్యూ కూడా వివాదం కాకుండా ఉండదు.

అంతే కాదు 90 శాతం వివాదాస్పద రివ్యూస్ ఇస్తూ చిత్ర బృందాలను రివ్యూ ఇస్తాను అంటూ భయపెట్టి డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ వంటివి కూడా చేసేయి రెండు చేతుల సంపాదించుకున్నాడు.ఇక అంతకు ముందే దుబాయ్ లో వస్త్ర వ్యాపారం లో కూడా అడుగు పెట్టాడు.

తెలుగు లో చిత్రాలను అత్యంత చవకగా కొని బాలీవుడ్ లో విడుదల చేయడం వంటివి చేసి బాగా లాభాలను ఆర్జించాడు.హిందీ లో వచ్చే సినిమాలపై తీర్వమైన స్థాయిలో విమర్శలు చేయడం అలవాటు గా చేసుకున్నాడు.

Who Is This Kamaal Rashid Khan , Kamaal Rashid Khan , Bollywood ,salman Khan, Bi
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇక ఆ మధ్య తక్కువ బడ్జెట్ లో సినిమా తీయాలంటే బాలీవుడ్ మొత్తం తెలుగు మరియు దక్షిణాది సినిమా లను చూసి నేర్చుకోవాలని హిందీ పెద్దలకు చురకలు అంటించాడు .మరోవైపు ఆచార్య సినిమా బాగుంది అంటూ, వాల్తేరు వీరయ్యలో చిరు అంత రొమాంటిక్ గా చేయడం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్ అత్యంత గొప్ప సినిమా అంటూ తప్పుడు రివ్యూ ఇచ్చి ఫాలోయర్స్ ఓపికకు పరీక్షా పెట్టాడు.

Advertisement

ఇలా నోటికి వచ్చింది మాట్లాడం తో అయన రివ్యూ లను జనాలు లైట్ తీసుకున్నారు.ఇక ఇపుడు పఠాన్ గొడవ తో తాను ట్విట్టర్ నుంచి తప్పుకునున్నట్టు, రివ్యూ లు ఇవ్వడం ఆపేస్తాను అంటూ చెప్తున్నాడు.

తాజా వార్తలు