చ‌ర్మ ఛాయ‌ను పెంచే ఎర్ర మట్టి..ఎలా వాడాలంటే?

సాధార‌ణంగా కొంద‌రు చ‌ర్మ ఛాయ‌ను పెంచుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటారు.క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ ప్యాకులు, సీర‌మ్‌లు ఇలా ఎన్నో యూజ్ చేస్తారు.

త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్‌కు వెళ్తూ ఫేషియ‌ల్స్ చేయించుకుంటారు.అయితే న్యాచుర‌ల్‌గా కూడా చ‌ర్మ ఛాయ‌ను పెంచుకోవ‌చ్చు.

అందుకు ఎర్ర మ‌ట్టి గ్రేట్‌గా సహాయ‌ప‌డుతుంది.అవును, ఎర్ర మ‌ట్టిలో చ‌ర్మ సౌంద‌ర్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ఔష‌ధ గుణాలు దాగి ఉన్నాయి.

ముల్తానీ మ‌ట్టి మాదిరిగానే ఎర్ర మ‌ట్టి కూడా మార్కెట్‌లో ల‌భిస్తుంది.మ‌రి ఈ ఎర్ర మ‌ట్టిని చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Whit Whitening Skin, Red Clay, Benefits Of Red Clay, Red Clay For Skin, Skin Ca
Advertisement
Whit Whitening Skin, Red Clay, Benefits Of Red Clay, Red Clay For Skin, Skin Ca

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఎర్ర మ‌ట్టి, చిటికెడు ప‌సుపు, రెండు స్పూన్ ల తేనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వని‌వ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.

మూడు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే క్ర‌మంగా చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.అలాగే ఒక గిన్నెలో రెండు స్పూన్ల ఎర్ర మ‌ట్టి తీసుకుని అందులో గ్రీన్ టీ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మంతో ఫేస్ ప్యాక్ వేసుకుని.పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఇప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌గ‌డంతో పాటు ముడ‌త‌లు, మ‌చ్చ‌లు కూడా దూరం అవుతాయి.

Whit Whitening Skin, Red Clay, Benefits Of Red Clay, Red Clay For Skin, Skin Ca
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఇక ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ఎర్ర మ‌ట్టి, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ మ‌రియు స‌రిప‌డా నీరు పోసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకుని.ప‌దిహేను నిమిషాల అనంత‌రం ఫేస్ వాష్ చేసుకోవాలి.

Advertisement

వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.అయితే ఈ ప్యాకులు వేసుకునే ముందు చేతిపై టెస్ట్ చేసుకోండి.

ఎలాంటి ఇబ్బంది అనిపించ‌కుంటే అప్పుడు ఫేస్‌కు యూజ్ చేయండి.

తాజా వార్తలు