Adavi sesh : ఇకనైనా రూటు మార్చు శేషా .. లేదంటే కష్టమే !

అడవి శేష్.సస్పెన్స్ సినిమాల రారాజు గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక రేంజ్ పాపులారిటీ ని దక్కించుకుంటూ వెళ్తున్నాడు.

ఇక అయన ఏ ముహూర్తాన క్షణం అనే సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడో అప్పటి నుంచి వరసగా అవే సినిమాల్లో నటిస్తున్నాడు.నిజానికి అతడు మొదట కర్మ అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ శేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టలేదు.

దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటించిన అవి మంచి పేరు అయితే వచ్చింది కానీ హీరో గా నిలబడాలన్న అడవి శేష్ కోరిక మాత్రం తీరలేదు.దాంతో అతడి సినిమాలకు అతడే స్క్రిప్ట్ రాసుకోవడం మొదలు పెట్టాడు.

అక్కడ నుంచి విజయాలు అతడి తలుపు తట్టాయి.క్షణం సినిమా హిట్ అతడిలో కాన్ఫిడెన్స్ పెరిగింది.

Advertisement
When Adavi Sesh Wants To Do Love Story , Adavi Sesh, Kshanam Movie, Amitumi, Ma

ఆ తర్వాత అమీ తుమీ వంటి సినిమా చేసిన అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.ఆ తర్వాత మళ్లి తన కలానికి పని పెట్టి గూఢచారి స్క్రిప్ట్ రాసాడు.

ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత ఎవరు, మేజర్ సినిమాలు కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ గానే వచ్చి విజయాన్ని సాధించాయి.

తాజాగా హిట్ ది సెకండ్ కేసు చిత్రం కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ప్రస్తుతం అందరి దృష్టి అడవి శేష్ తీయబోతున్న మరో సినిమా పై పడింది.అస్సలే లేడీ ఫ్యాన్స్ బీభత్సంగా ఉన్న అడవి శేష్ ఇంకా ఎన్ని రోజులు ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ సినిమాల్లో నటిస్తాడు అంటూ పెదవి విరుస్తున్నారు.

ఒక కల్ట్ క్లాసిక్ సినిమాలో ఎప్పుడు నటిస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు.

When Adavi Sesh Wants To Do Love Story , Adavi Sesh, Kshanam Movie, Amitumi, Ma
ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఒకవైపు అడవి శేష్ కి వెరీ బిగ్ ఫ్రెండ్ అయినా స్వప్న వైజయంతి మూవీస్ నుంచి సినిమా తీస్తే అడవి శేష్ ని కాదని దుల్కర్ తో సినిమా తీశారు.సీత రామం వంటి ఒక సినిమాలో అడవి శేష్ కనిపిస్తే ఎంతో బాగుండు అని అందరు అనుకుంటున్నారు.అయితే ఈ విషయం పై ఆల్రెడీ పలు ఇంటర్వూస్ లో శేష్ క్లారిటీ కూడా ఇస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ లో నటిస్తున్న అడవి శేష్ ఆ చిత్రం తర్వాత ఒక హార్డ్ కోర్ లవ్ స్టోరీ లో నటించనున్నట్టు తెలిపాడు.ఇక తనకు సీత రామం సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పాడు.

తాజా వార్తలు