వాట్సప్‌ యూజర్లకు శుభవార్త: త్వరలో మరో సరికొత్త ఫీచర్ రాబోతోంది!

వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త.యూజర్ల అనుకూలత దృష్టిలో పెట్టుకొని వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తున్న విషయం తెలిసినదే.

తాజాగా మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ని జోడించిన సంగతి తెలిసిందే.అయితే త్వరలో మనం ఈ ప్లాట్‌ఫారమ్‌లో మరో కొత్త ఫీచర్‌ను చూడబోతున్నాం.

చాట్ ఫిల్టర్ అనే ఆప్షన్‌ను అందించేందుకు వాట్సప్ కృషి చేస్తోంది.ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుడు చాట్‌లను వివిధ క్యాటగిరీలను ఫిల్టర్ చేసే అవకాశాన్ని పొందుతాడు.

Gmail, ఇతర ఈమెయిల్ సేవలలో ఇటువంటి లక్షణాలు ఉన్నాయి.అయితే, ఈ ఫీచర్ ఈమెయిల్ సేవలకు కొద్దిగా భిన్నంగా అందిస్తోంది.

Advertisement
Whatsapp Launching Chat Filter Feature For Its Users Details, WhatsApp, Service

ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బిజినెస్ క్లయింట్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.ఈ మేరకు స్క్రీన్‌షాట్‌ను కూడా తాజాగా షేర్ చేసింది.

త్వరలో మిగతా వినియోగదారులకు ఈ అవకాశం లభించనుంది.ఇందులో చదవని చాట్‌లు, కాంటాక్ట్, నాన్-కాంటాక్ట్, గ్రూప్ ఇలాంటివి ఉంటాయి.

ఇక ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు తమ కథనాలను తమకు కావలసిన వ్యక్తులతో పంచుకోవచ్చు.అయితే వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు.

ప్రస్తుతం ఈ ఆప్షన్ వెబ్ లేదా డెస్క్‌టాప్ వెర్షన్‌ వారికి అందుబాటులో వుంది.

Whatsapp Launching Chat Filter Feature For Its Users Details, Whatsapp, Service
ఆ ఈవెంట్ లో అవమానం.. నితిన్ సారీ చెప్తాడని వెళ్తే అలా జరిగింది.. హర్షవర్ధన్ కామెంట్స్ వైరల్!
న్యూస్ రౌండప్ టాప్ 20 

తాజా సమాచారం ప్రకారం ఈ ఫీచర్ iOS, Android వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఈ సందర్భంగా వాట్సాప్ ఇటీవల అనేక కొత్త ఫీచర్ల వివరాలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.ఈ ఏడాది చివరి నాటికి ఎన్నో సరికొత్త ఫీచర్లు జోడించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా వివిధ సోషల్ మీడియా యాప్స్ యూజర్స్ ని ఆకట్టుకొనే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఈ క్రమంలో ఫేస్ బుక్, ఇన్స్టా గ్రామ్ కూడా అనేక ఫ్రెండ్లీ ఫీచర్స్ ని తమ యూజర్లకోసం అందిస్తున్నాయి.

ఇకపోతే సోషల్ మెసేజింగ్ యాప్స్ విషయానికొస్తే, వాట్సప్‌ అన్నింటికంటే ముందంజలో ఉండటం గమనార్హం.

తాజా వార్తలు