శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలివే..?

ప్రస్తుత కాలంలో చాలా మంది నెమ్మదిగా కూర్చుని మనస్ఫూర్తిగా భోజనం చేయటానికి కూడా సమయం దొరకడం లేదు.ఉరుకు పరుగుల కాలంతో పాటు మనుషులు కూడా పరిగెడుతూ తినే తిండిని, తాగే నీటిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పవచ్చు.

 What Are The Rules To Be Followed While Eating According To Science-TeluguStop.com

అయితే భోజనం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ఆందోళనలు పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తూ భోజనం చేయాలని పండితులు చెబుతున్నారు.భోజనం చేసేటప్పుడు ఇష్టానుసారంగా కాకుండా కచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు.

మరి భోజనం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 What Are The Rules To Be Followed While Eating According To Science-శాస్త్రం ప్రకారం భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలివే..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నం తినేటప్పుడు తప్పకుండా ఆ భగవంతుని స్మరిస్తూ భోజనం చేయాలి.

ఇష్టానుసారంగా భోజనం చేయటం వల్ల ఎంతో దరిద్రం అని పండితులు తెలియజేస్తున్నారు.మనం భోజనం చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా తూర్పు దిశ వైపుకి మళ్లీ భోజనం చేయాలి.

రాత్రిపూట భోజనం చేసిన తర్వాత తిన్న కంచాలను మరుసటి రోజు ఉదయం కడగకూడదు.అప్పుడే కడిగేయడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతాము.

చాలామంది భోజనం చేసేటప్పుడు తమ కంచాన్ని నోటి దగ్గరకు తీసుకు వెళ్లి తింటారు.అలా తినడం మంచిది కాదు.

చాలామంది అన్నం తినేటప్పుడు అన్నం వేళ్ళ మధ్యలో నుంచి బయటకు వస్తుంది అలా తినటం వల్ల పరమ దరిద్రమని పండితులు తెలియజేస్తున్నారు.అలాగే భోజనం తినేటప్పుడు కొన వేళ్లకు మాత్రమే కాకుండా అరిచేతిని తాకేలా భోజనం చేయాలి.

అలాగే చాలామంది అరి చేతికి అన్నం అయిందని దానిని కంచానికి వేసి రుద్దుతారు.అలా చేయటం మంచిది కాదు.

ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చీటికిమాటికి పైకి లేయకుండా, భోజనం మధ్యలో నుంచి వెళ్లిపోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

#Vasth Tips #Ruls #Science

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

DEVOTIONAL