ప్రముఖ హాస్యనటుడు వివేక్ నిజ జీవితం గురించి మీకు తెలుసా..!

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హాస్యనటుడు వివేక్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆయన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

ఇక వివేక్ తమిళ చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్.ఆయన తమిళనాడులోని కోవిళ్పట్టిలో జన్మించారు.

అయితే వివేక్ కి చిన్నప్పటి నుండి సినిమాలో నటించాలనే కోరిక ఉండేది.ఇక ఆయన కోరికను నిజం చేసుకోవడానికి చెన్నైకి వచ్చారు.

ఆయన 1980 నుంచి ఒక వైపు చదువుకుంటూ నాటకాలు వేశారు.ఈ సమయంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగం కూడా సంపాదించారు సెక్రటేరియెట్ లో ఉద్యోగం చేస్తూ నాటకాలు కూడా వేశాడు.

Advertisement
Well Known Comedian Vivek Real Life Story, Vivek , Kollywood, Padma Shri Award,

తర్వాత సినిమాల్లో బిజీ అయి ఆయన ఉద్యోగం వదిలేశారు.ఇక ప్రముఖ దర్శకుడు బాలచందర్ 1987లో మనదిళ్ ఉరుది వేండం చిత్రం ద్వారా వివేక్ను సినిమా రంగానికి పరిచయం చేశారు.

అంతేకాదు.ఆయన 300కి పైగా చిత్రాల్లో నటించారు.1990ల నుంచి హీరోల పక్కన స్నేహితుడి పాత్రల్లో కనిపించడం ప్రారంభించారు.ఇక ఆయన సినిమాలో లేకపోతే కష్టం అనేంతగా దర్శక నిర్మాతలు హీరోలు భావించేవారు.

అందరూ అగ్రహీరోల సినిమాల్లో వివేక్ నటించారు.ఇక దేశంలో జరుగుతున్న మూఢ నమ్మకాలు, జనాభా పెరుగుదల, అవినీతి, ఆడ శిశువుల హత్యలు, నగరాల్లో మురికివాడల ప్రజల కష్టాల గురించి ఆయన నవ్విస్తూనే సెటైర్లు వేసేవారు.

అంతేకాదు.తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు బాయ్స్, అపరిచితుడు, శివాజీ, సింగం వంటి చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైయ్యారు.

Well Known Comedian Vivek Real Life Story, Vivek , Kollywood, Padma Shri Award,
Advertisement

అంతేకాక.2009లో వివేక్ పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.2019లో వివేక్ తల్లి మృతి చెందారు.2017లో డెంగ్యూ బారిన పడి కొడుకు ప్రసన్న కుమార్ చనిపోయారు.అప్పటి నుంచి ఆయన చాలా విషాదంలో ఉన్నారు.

ఇక వివేక్ టీవీ హోస్ట్గా అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్ వంటి వారిని ఇంటర్వ్యూలు చేసి ప్రశంసలు అందుకున్నారు, ఉత్తమ హస్య నటుడిగా అనేక పురస్కారాలు తమిళనాట అందుకున్నారు.ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు.

తాజా వార్తలు