Viva Harsha : డబ్బు కోసమే ఆ అవమానాలను భరించాను.. వైవా హర్ష ఎమోషనల్ కామెంట్స్!

వైవా హర్ష( Viva Harsha ) పరిచయం అవసరం లేని పేరు.

యూట్యూబర్ గా ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హర్ష అనంతరం సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాలను అందుకున్నారు.

ఇలా కలర్ ఫోటో( Color Photo ) తర్వాత ఈయన కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా వరుస సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వైవా హర్ష త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

వైవా హర్ష దివ్య శ్రీపాద( Divya Sripada) హీరో హీరోయిన్లుగా హీరో రవితేజ నిర్మాణంలో తెరకెక్కినటువంటి సుందరం మాస్టర్( Sundaram Master ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 23వ తేదీ విడుదల కాబోతున్న తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైవా హర్ష తన గురించి వచ్చినటువంటి బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

తాను చిన్నప్పుడు ఆస్తమా సమస్యతో బాధపడేవాడిని ఈ సమస్యకు నాకు స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల భారీగా శరీర బరువు పెరిగానని తెలిపారు.ఇలా అధిక శరీర బరువు పెరగడంతో స్కూల్ స్టేజ్ లోనే నేను బాడీ షేమింగ్( Body Shaming ) కామెంట్స్ ఎదురు కొన్నానని తెలిపారు.ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా నా బరువు గురించి నా రంగు గురించి చాలామంది నవ్వుకున్నారని నా పట్ల హేళనగా మాట్లాడేవారని తెలిపారు.

Advertisement

కలర్ ఫోటో సినిమా ముందు వరకు కూడా నేను ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.అయితే కెమెరా ముందు నిలబడిన తర్వాత నన్ను చూసి చాలామంది అవమానకరంగా మాట్లాడిన కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ అవమానాలు అన్నింటిని భరించాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు