కోరుట్ల పేటలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సందర్శన

రాజన్న సిరిసిల్ల (Rajanna Sirisilla)జిల్లా ఎల్లారెడ్డిపేట(Ellareddypet) మండలం కోరుట్ల పేట గ్రామంలో నేషనల్ లెవెల్ మానిటరింగ్ టీం సందర్శించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రాం, నేషనల్ రూరల్ లైవ్ లీవుట్ ప్రోగ్రాం పథకాలకు సంబంధించి గ్రామాలలో జరిగిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా క్షేత్రస్థాయిలో జరిగిన పనుల రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు గ్రామస్తులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అధికారుల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

సందర్శించిన వారిలో మానిటరింగ్ టీం లీడర్ ఎస్పీ సునీల్ కుమార్, టీం సభ్యులు స్నేహ ,నజీబ్ ,ఏపీ డి నర్సింలు ,ఐకెపి ,డిపిఎం సుధారాణి, ఎంపీ ఓ రాజు, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ తదితరులు ఉన్నారు.

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.
Advertisement

Latest Rajanna Sircilla News