బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేస్తూ దొరికిన విష్ణుప్రియ.. పరువు మొత్తం పోయిందిగా!

తెలుగులో ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss Season 8 ) షో ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇప్పటికీ చాలామంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వగా కొందరు వైల్డ్ కార్డు ద్వారా గత వారం ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవలే మొదలైన ఈ షో ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది.మాజీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ షో మరింత రసవత్తరంగా మారింది.

అయితే ముఖ్యంగా ఈ స‌మ‌యంలోనే హౌజ్‌లోని మెంబ‌ర్స్ న‌డ‌వ‌డిక‌ను బిగ్‌బాస్‌ రెండు రాష్ట్ర ప్ర‌జ‌ల ముందు ఉంచుతోంది.ఇక కంటెస్టెంట్స్ త‌మ ఓపిక‌ను, అల‌వాట్ల‌ను కంట్రోల్ చేసుకోలేక‌ త‌మ‌ వాస్త‌వ‌ ప్ర‌వర్త‌న‌తో అడ్డంగా బుక్ అవుతున్నారు.

Vishnupriya Smoking In Bigg Boss 8 Telugu Photo Viral, Vishnu Priya, Smoking, Bb

రెండు వారాల క్రితం ఇద్ద‌రు మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మ‌ధ్య ఏదో జ‌రుగుతుందంటూ సోష‌ల్‌ మీడియాలో ర‌చ్చ కాగా తాజాగా విష్ణుప్రియ ఆ లిస్టులో చేరింది.ప్ర‌స్తుతం ఈ సీజ‌న్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌, ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉన్న యాంకర్ విష్ణుప్రియ ( Vishnu Priya )పొగ తాగుతూ కెమెరాల‌కు చిక్కింది.ఇటీవ‌ల హౌజ్‌లోకి వ‌చ్చిన అనంత‌రం ఒక ఎపిసోడ్‌లో నిఖిల్ మ‌ణికంఠ‌ను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్ ప‌డేస్తున్న స‌మ‌యంలో బ్యాగ్రౌండ్‌ లో ఉన్న స్మోకింగ్ జోన్‌ లో విష్ణుప్రియ సిగ‌రెట్ తాగుతూ కనిపించింది.

Advertisement
Vishnupriya Smoking In Bigg Boss 8 Telugu Photo Viral, Vishnu Priya, Smoking, Bb

అయితే, అక్క‌డున్న‌ది సీత అని కొందరు డౌట్ పడినప్ప‌టికీ ఆ రోజు ఎపిసోడ్‌ లో విష్ణుప్రియ ధ‌రించిన‌ బ్లాక్ అండ్ వైట్ బుల్లి గౌను బ‌ట్టి అక్క‌డున్న‌ది విష్ణు ప్రియ‌నే అని నిర్ధార‌ణ చేస్తున్నారు.దీంతో హౌస్ లో విష్ణుప్రియ స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది.

Vishnupriya Smoking In Bigg Boss 8 Telugu Photo Viral, Vishnu Priya, Smoking, Bb

ఇక ఆమె పరువు మొత్తం పోయినట్టుగా అయిపోయింది.మరి ఈ విషయం గురించి నాగార్జున వీకెండ్ లో ఏమని స్పందిస్తారో చూడాలి మరి.అయితే విష‌యాన్ని కొంత‌మంది న‌మ్మ‌డం, మ‌రికొంత‌మంది న‌మ్మ‌లేక పోవ‌డంతో హౌజ్‌లో స్మోకింగ్ చేసేవారి గురించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చెప్పిన వీడియోల‌ను షేర్ చేస్తున్నారు.హౌజ్‌మేట్ల‌లో పురు చెప్ప‌కుండా ఒక లేడీ ద‌మ్ముకొడుతుంద‌ని దానిని టెలికాస్ట్ చేయ‌డం లేదంటూ ఇటీవ‌ల ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల చెప్పిన విష‌యం తెలిసిందే.

అదేవిధంగా ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌజ్‌లో అడిగిన వారికి బీర్ ఇస్తారట కదా అని ఆర్జే శేఖర్ బాషా( RJ Shekar Basha )ను అడగగా అలాంటి అవ‌కాశ‌మే లేదు కానీ, పృథ్వీ, నిఖిల్‌, విష్ణుప్రియ దమ్ము కొడుతుంటారు అని శేఖర్ బాషా చెప్పి అయ్యో చెప్పేసానా అంటూ నాలుక సైతం క‌ర్చుకున్న సంగ‌తి విధిత‌మే.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు