టాలీవుడ్ హీరో బాలయ్య బాబు( Nandamuri Balakrishna ) గురించి మనందరికీ తెలిసిందే.బాలయ్య బాబు ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్న విషయం తెలిసిందే.
అటు రాజకీయపరంగా ఇటు సినిమాల పరంగా వరుసగా సక్సెస్ లను అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు బాలయ్య బాబు.ఇకపోతే తాజాగా బాలయ్య బాబుకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
అదేమిటంటే బాలయ్య బాబు సూపర్ హీరోగా కనిపించబోతున్నారా అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయం గురించి చర్చలు కూడా కొనసాగుతున్నాయి.అఖండ తర్వాత డిఫరెంట్ మూవీ స్, పాత్రలు చేస్తున్న బాలయ్య ఇప్పుడు తర్వాత మూవీ కోసం సూపర్ హీరోగా కనిపిస్తారని అంటున్నారు.దసరా కానుకగా అక్టోబరు 11న దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చని అంటున్నారు.
అయితే బాలకృష్ణ, సూపర్ హీరోగా కనిపిస్తారు సరే.కానీ దీన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతుంది లాంటి అంశాలపై ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారాయి.రీసెంట్ టైమ్ లో పురాణాల్లోని పలువురు సూపర్ హీరోలని బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి.హనుమాన్, అలాగే కల్కి ఈ తరహా చిత్రాలే అని చెప్పవచ్చు.

ఇప్పుడు బాలయ్య కూడా ఇలాంటి సినిమానే చేయబోతున్నారని తెలుస్తోంది.లేదంటే ఇదంతా కూడా కొడుకు మోక్షజ్ఞ నటించే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది.మరి బాలయ్య సూపర్ హీరో అనేది నిజమా కాదా అనేది అధికారిక ప్రకటన వస్తే ఏం మాట్లాడలేం.కానీ ప్రస్తుతం ఇదే వార్త మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇకపోతే బాలయ్య బాబు ప్రస్తుతం 2,3 సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.