టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఆ సినిమా కోసం సిద్ధమవుతున్నారు మహేష్ బాబు.
ఇటీవల మహేష్ బాబు లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు చూస్తే ఆ విషయం బాగా అర్థమవుతోంది.దీనికోసం ఆయన మేకోవర్ అవుతున్నారు.
ఇటీవలే జర్మనీ వెళ్లి శిక్షణ తీసుకున్నారు.జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తన నుంచి ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) వచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది.అందుకు కారణం మహేష్ బాబుకు ఉన్న అభిమానుల బలం.మహేష్ బాబు ఎప్పుడు ఏ సినిమాను ఎంచుకుంటాడో? ఎందుకు ఏ సినిమాను వద్దంటాడో? ఆయన సన్నిహితులకు కూడా అర్థం కాదని చెప్పాలి.అయితే ఏ సినిమాలో చూసినా నేను ఒకేలా కనపడతాను అంటే ప్రేక్షకులు కొన్నాళ్లు మాత్రమే చూస్తారు.అలా పాత్రల్లో మేకవర్ అవ్వాల్సి వస్తుందనే కారణంతో మూడు సినిమాలు వదులుకోగా వాటిని చేసిన హీరో బ్లాక్ బస్టర్లు సాధించి పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

అయితే పుష్ప సినిమా( Pushpa movie ) ముందుగా మహేష్ బాబుతో చేయాలని సుకుమార్ భావించారట.ఎంత చెప్పినా ప్రిన్స్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదట.పైగా అది నాకన్నా అల్లు అర్జున్ కు బాగా సెట్ అవుతుందని చెప్పి మరీ పంపించారట.ఆ సినిమా తెలుగులో కన్నా హిందీలో భారీ హిట్ సాధించింది.పుష్ప2 హిట్ అయితే బన్నీ పాన్ ఇండియా హీరోగా స్థిరపడినట్లే.అలాగే అలా వైకుంఠపురం కూడా మహేష్ బాబు చేయాలట.
కానీ వేరే సినిమాలు చేస్తుండటంతో ఖాళీ లేదని చెప్పడంతో త్రివిక్రమ్ బన్నీతో చేశాడు.మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలని త్రివిక్రమ్ ఎంతగా ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.
సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అల్లు అర్జున్ రేంజ్ ను పెంచేసింది.గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి అనే శక్తివంతమైన పాత్రను చేయాలని అడిగినా మహేష్ బాబు ఒప్పుకోలేదట.
దీంతో అల్లు అర్జున్ చేత దర్శకుడు ఆ పాత్ర చేయించగా మంచిపేరు రావడంతో పాటు రేంజ్ కూడా పెరిగింది.ఇలా నేను మారను ఇలానే ఉంటాను అంటే రాజమౌళి బెత్తం పట్టుకుంటాడు.
అందుకే ఆయన కోరినట్లుగా ఇప్పుడు ఆ పాత్రకోసం జుట్టు, గెడ్డం మహేష్ బాబు పెంచుతున్నాడు.