మొండి మచ్చలు మదన పెడుతున్నాయా? వర్రీ వద్దు.. కాఫీ పౌడర్ తో ఇలా చేయండి!

మొటిమలు, పిగ్మెంటేషన్, వయసు పైబడటం తదితర కారణాల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి.ఈ మచ్చల‌ను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

 Follow This Remedy With Coffee Powder To Get Rid Of Stubborn Blemishes, Blemishe-TeluguStop.com

అయితే ఎంత ప్రయత్నించిన సరే ఒక్కోసారి ఆ మచ్చలు వదిలిపెట్టవు.వీటిని మొండి మచ్చలు అంటారు.

ఈ మొండి మచ్చలను నివారించుకోవ‌డం కోసం చాలా మంది మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్స్, సిరమ్స్ పై ఆధారపడుతుంటారు.కాస్త ధనవంతులైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారు.

కానీ ఇంట్లోనే మొండి మచ్చలను వదిలించుకోవచ్చు.అందుకు కాఫీ పౌడర్ చక్కగా సహాయపడుతుంది.మీరు కూడా మొండి మచ్చలతో మదన పడుతున్నారా.? వర్రీ వద్దు.కాఫీ పౌడర్ తో ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే సులభంగా వాటిని నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక మీడియం సైజు కీర దోసకాయ తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

Telugu Tips, Blemishes, Coffee Powder, Remedy, Latest, Skin Care, Skin Care Tips

ఈ స్లైసెస్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను స్టైనర్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ ను వేసుకోవాలి.

చివరిగా సరిపడా కీర దోసకాయ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖ చర్మం మొత్తానికి అప్లై చేసుకోవాలి.

ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వనిచ్చి అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Blemishes, Coffee Powder, Remedy, Latest, Skin Care, Skin Care Tips

రోజుకి ఒక్కసారి ఈ మ్యాజికల్ రెమెడీని కనుక పాటిస్తే ఎంతటి మొండి మచ్చలు అయినా కేవలం కొద్ది రోజుల్లోనే మాయం అవుతాయి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం హైడ్రేటెడ్ గా మరియు గ్లోయింగ్ గా మారుతుంది.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

మరియు మొటిమలు సైతం తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube