వైరల్ వీడియో : ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.!

హైదరాబాద్‌ నగరు శివారులోని ముచ్చింతల్‌ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.అక్కడ సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాల్లో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు ఉత్సవ శోభాయాత్రను ఘనంగా చేస్తున్నారు.ఈ ఉత్సవాలు మొత్తగా 12 రోజులపాటు జరగున్నాయి.

ఈ మహాయాగం ఉత్సవాలు ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతాయి.ఉత్సవాల్లో మూడో రోజు యాగశాలలో లక్ష్మీనారాయణ యాగం, లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలను ఘనంగా చేసారు.

ఇప్పుడు ఈ ఉత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి.ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న చినజీయర్‌ స్వామితోపాటు మరో ఏడుగురు జీయర్‌ స్వాముల సమక్షంలో ఈ పూజలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Advertisement
Viral Video Sri Ramanujacharyulu Sahasrabdhi Event In Muchhinthal Details, Vira

ప్రస్తుతం ఈ ఉత్సవ విగ్రహాలకు సంబంధించిన ఒక శఠగోపం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం ఏంటంటే ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం.

ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చింతల్‌ కు రానున్నారు.

Viral Video Sri Ramanujacharyulu Sahasrabdhi Event In Muchhinthal Details, Vira

216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ, చినజీయర్​ స్వామితో కలిసి పూజ చేస్తారు.తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమిస్తారు.కాగా శ్రీమత్ రామానుజాచార్యుల వారి సువర్ణ విగ్రహ పూజా నిమిత్తము తయారు చేసిన శఠారి అంటే శఠగోపం అనేది ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవముతో వినియోగంలోకి వస్తుంది.

ప్రస్తుతం ఈ శఠగోపం వీడియో బాగా వైరల్‌గా మారింది.ఈ శఠగోపం చూడడానికి భలే అందంగా ఉంది.బంగారంతో తయారుచేయబడిన ఈ శఠగోపం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుంది.

సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు