వైర‌ల్ వీడియోః రోడ్డుమీద పాముల నృత్యం..!

సాధారణంగా పాము కనిపిస్తే చాలు.జనాలు భయపడిపోతుంటారు.

మానవాళికి ఏం చేయొద్దని కోరుతూ దాన్ని పూజిస్తుంటారు.

ఈ క్రమంలోనే నాగుల చవితి పండుగ వచ్చినట్లు పెద్దలు చెప్తుంటారు.

అయితే, ఇంతగా పామును పూజిస్తున్నప్పటికీ అది ఇంట్లోనో లేదా పరిసరాల్లోకి వస్తే చాలు అది ఎక్కడ తమకు హాని చేస్తుందేమోనని దానిని చంపేస్తుంటారు.ఇక కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో మూగజీవాలు అన్నీ దాదాపు రోడ్లన్నీ ఆక్యుపై చేశాయి.

హ్యాపీగా పర్యావరణంలో, సొసైటీలో తాము కూడా భాగమేనని చెప్పకనే చెప్పాయి.ఈ క్రమంలో రోడ్డుపై పాములు నృత్యం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండవుతోంది.

Advertisement
Viral Video Snake Dance On The Road, Snake Dance, Viral Video, Snake Dancing On

ఇంతకీ ఏం జరిగిందంటే.కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి.

దాంతో పబ్లిక్ ప్లేసెస్ థియేటర్స్, పార్కులు, పర్యాటక ప్రదేశాలు ఇతరాలు అన్నీ మూసివేయబడ్డాయి.జనాలు ఇండ్లకే పరిమితం అయ్యారు.

పర్యాటక ప్రదేశాల్లో సందడి వాతావరణం కరువైంది.అయితే, పార్కులు ఇతర పర్యాటక ప్రదేశాల్లో వన్యప్రాణులు అన్నీ హ్యాపీగా బయటకు వస్తున్నాయి.

లాక్‌డౌన్ టైంలో ఎలాగూ జనాల సందడి లేదు.దాంతో పాములు, ఇతర వన్యప్రాణులు బయట కనపించడం మనం చూశాం.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

కాగా, తాజాగా వైరలవుతోన్న ఈ వీడియోలో పాములు సయ్యాటలాడుతున్నాయి.

Viral Video Snake Dance On The Road, Snake Dance, Viral Video, Snake Dancing On
Advertisement

వళ్లు గగుర్పొచే ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.ఓ పార్కులో నాగుపాములో శృంగారకేళిలో మునిగితేలుతూ నాట్యం చేస్తున్నాయి.వాటిని అటుగా వచ్చేవారు శృంగభంగం చేసే ప్రయత్నం కూడా చేయలేదు.

ఈ సంఘటనను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.అది చూసి నెటిజనాలు భయపడుతున్నారు.

కానీ, దానిని షేర్ చేస్తూ, లైకులు కొడుతూ ట్రెండ్ చేస్తున్నారు.దాంతో సదరు వీడియో బాగా వైరలవుతోంది.

భయంకరమైన వీడియో అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.

తాజా వార్తలు