వైరల్: ఎడారిలో కురిసిన మంచు వర్షం....

ఎడారి అంటే సాధారణంగా మనందరికీ మనకు తెలిసిన విషయం అక్కడ నీరు దొరకడమే కష్టం కదా.ఎడారిలో మానవమాత్రులు బ్రతకడం కష్టమే.

ఎందుకంటే అటువంటి చోట ఎంతగా ఉష్ణోగ్రతలు ఉంటాయో మనకు తెలుసు కదా.అక్కడ అటువంటి వాతావరణానికి ఒంటెలు, వానపాములు తప్ప ఎటువంటి జంతువూ అక్కడ జీవించలేదు.అంతేకాక అటువంటి ప్రదేశాలకు పర్యాటక నిమిత్తం వెళ్తే సరైన దారి కూడా కనిపించకుండా అక్కడే చిక్కుకుపోయే అవకాశం ఎక్కువ.

అంతేకాక అటువంటి ప్రదేశాలలో ఇక వర్షాలు పడడం అనేది అసంభవం.కాని ఇటువంటి కఠిన పరిస్థితులను కలిగి ఉండే ఎడారి ప్రాంతంలో భారీ వర్షం కురిస్తే ఇక అది గొప్ప విషయమనే చెప్పాలి.

కాని అక్కడ మంచు వర్షం కురుస్తే అది పెద్ద వార్త అవుతుంది.అది ఒక్క విచిత్రమనే చెప్పవచ్చు.ఇక అసలు విషయంలోకి వెళ్తే సహారా ఎడారిలో ఈ మధ్య -3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో మంచు వర్షం కురిసింది.ఈ చిత్రాలను కరీం బౌచే టాట అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాలను నెట్టింట్లో విడుదల చేయడంతో ఈ చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు