వైరల్: గొప్పమనసు.. కంపెనీ ఉద్యోగికి బెంజ్ కారు గిఫ్ట్ గా ఇచ్చిన యజమాని!

దాదాపుగా మనచుట్టు వివిధ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎవరన్నా ఈ విషయం అడిగి చూడండి.జాబ్ సాటిసిఫేక్షన్ ఉందా అని? 99% మంది ఉద్యోగులు లేదనే చెబుతారు.

దీనికి అనేక కారణాలు.

మెకానికల్ యుగంలో మనిషి ఓ మెషిన్ లాగా పనిచేయవలసి ఉంటుంది.అయినా తన కష్టానికి తగిన గుర్తింపు ఉందీ అంటే అది అనుమానమే.కొంత మంది యజమానులు తమ ఉద్యోగులతో పని చేయించుకుని సరైన జీతభత్యాలు ఇవ్వరు.

Viral Great Mind The Owner Gave A Benz Car As A Gift To The Company's Employeem

అదే పనిచేయకుండా ఆడుతూపాడుతూ మేనేజర్స్ తో కుళ్ళు జోకులు వేసుకొని బతికేవారికి మంచి గుర్తింపు ఉంటుంది.అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా మంచి మనసున్న యజమానులు కొంతమంది ఉన్నారు.

తాజా సంఘటనే దానికి ఓ మంచి ఉదాహరణ.ఓ యజమాని తన ఉద్యోగి జీతమే కాకుండా ఓ ఖరీదైన బెంజ్ కారు కొనిచ్చాడు.

Advertisement

దాంతో కారు బహుమతిగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీని ఖరీదు అక్షరాలా రూ.45 లక్షలు.AK షాజీ కేరళలోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల రిటైలర్ అయిన myGకి యజమాని.

ఈ బహుమతిని అందుకున్న ఉద్యోగి CR అనీష్.అతను గత 22 సంవత్సరాలుగా షాజీ దగ్గర ఎంతోనమ్మకంతో పని చేస్తున్నాడు.

అనీష్ myG స్థాపించబడటానికి చాలా కాలం ముందు నుంచి షాజీతో ఉన్నాడు.అనీష్ ఈ సంస్థ మార్కెటింగ్, నిర్వహణ, వ్యాపార అభివృద్ధి విభాగాలలో అతడు వెలలేని సేవలను అందించాడు.

ప్రస్తుతం, అతను myG చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గా ఉన్నాడు.అనీష్ కు సోదర ఆప్యాయత, ఏకాగ్రత, పని పట్ల అంకితభావం ఉందని షాజీ కొనియాడాడు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!

షాజీ తన ఉద్యోగికి బహుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.రెండేళ్ల క్రితం తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి వార్తల్లోకి ఎక్కాడు.

Advertisement

తాజా వార్తలు