వైర‌ల్‌.. మ‌గ సింహంతో ఆడ సింహాల పోరు..

అడ‌వి అంటేనే నిత్యం యుద్ధ వాతావ‌ర‌ణంతో కూడుకుని ఉంటుంది.ఇక్క‌డ బ‌తికి బ‌ట్ట క‌ట్టాలంటే నిత్యం పోరాడుతూనే ఉండాలి.

లేదంటే మాత్రం ఏ క్ష‌ణం అయినా ప్రాణాలు కోల్పోవ‌చ్చు.ఇక జంతువుల్లో అయితే త‌మ జాతికి చెందిన వాటితో కూడా ప్రాణాల‌కు ప్ర‌మాదం పొంచి ఉంటుంది.

కాబ‌ట్టి ఆ జంతువులు నిత్యం అల‌ర్ట్ గానే ఉంటాయి.ఇక క్రూర జంతువుల విష‌యానికి వ‌స్తే మాత్రం ఒక జంతువును చూస్తే ఇంకో జంతువు అస్సలు ఊరుకోదు.

మ‌రీ ముఖ్యంగా సింహాల విష‌యంలో ఇది ఎక్కువ‌గా జ‌రుగుతూ ఉంటుంది.సింహాలు త‌మ తోటి సింహాల‌ను చూస్తే మాత్రం అస్స‌లు ఊరుకోవు.

Advertisement

వాట‌ని చీల్చి చెండాడుతాయి.త‌మ ప్రాంత ప‌రిధి నుంచి త‌రిమి కొట్టే వ‌ర‌కు ఊరుకోవు.

అయితే అప్పుడ‌ప్పుడు మగ సింహాల మీద కూడా ఆడ సింహాలు దారుణంగా దాడి చేస్తాయి.ఆడ సింహాలు కూడా మ‌గ సింహాల‌కు ఏ మాత్రం త‌క్కువ కాకుండా ఉంటాయి కాబ‌ట్టి వీటి పోరు అంత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంది.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్‌ అవుతోంది.దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.

సింహాల పోరు ఇంత డేంజరా అనిపిస్తుంది ఈ వీడియో.

యశ్ టాక్సిక్ సినిమాలో స్టార్ హీరోయిన్.... అధికారిక ప్రకటన వెల్లడి!
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన

వాస్త‌వానికి మ‌గ సింహాలు ఎప్పుడూ ఒంట‌రిగానే తిరుగుతుంటాయి.కానీ ఆడ సింహాలు మాత్రం గుంపులు, గుంపులుగా వ‌స్తుంటాయి.అయితే ఇప్పుడు కూడా ఓ మ‌గ సింహం ఇలాగే సింగిల్ గా రావ‌డాన్ని చూసిన రెండు ఆడ‌సింహాలు వెంట‌నే దాని మీద దాడికి దిగిపోయాయి.

Advertisement

ఇక వాటి నుంచి త‌ప్పించుకునేందుకు మగ సింహం ఎంత‌లా ప్రయత్నించినా కుద‌ర‌దు.ఆడ సింహాలు ప‌ట్టు వ‌ద‌ల‌కుండా దాడి చేయ‌డంతో మ‌గ సింహం అక్క‌డి నుంచి పారిపోతుంది.

అయితే ఒక మ‌గ సింహం ఇలా ఆడ సింహాల‌కు భ‌య‌ప‌డ‌టం మాత్రం చాలా అరుదుగా జ‌రుగుతుంది.

తాజా వార్తలు