స్వార్థం, కపటం అంటూ పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి సీరియస్ పోస్ట్..!!

చంద్రబాబు( Chandrababu ) మధ్యంతర బెయిల్ పై విడుదలైన తర్వాత వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరియు పురంధేశ్వరి ( Purandeshwari )మధ్య గట్టిగా మాటలు యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కాకుండా తెలుగుదేశం పార్టీకి మేలు చేసే విధంగా పురంధేశ్వరి రాజకీయాలు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

అనంతరం విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) బెదిరింపులకు పాల్పడుతున్నారని.ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి లేఖ రాశారు.

విజయసాయిరెడ్డి పలువురిని బెదిరిస్తూ అక్రమలకు దిగారని ఆ లేఖలో తెలియజేయడం జరిగింది.ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న సమయంలో కడప నుంచి గుండాలను దీంచి భూ అక్రమణాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

దీంతో వీరిద్దరి మధ్య మాటలు యుద్ధం మరింతగా పెరిగింది.తాజాగా ట్విట్టర్ లో పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి సీరియస్ పోస్ట్ పెట్టారు.

Advertisement

"స్వార్థం, కపటం పురంధేశ్వరి సహజ అభరణాలు.టీడీపీతో పొత్తులేకున్నా సొంత పార్టీని గాలికొదిలేసి దానిని తలకెత్తుకున్నారు.

బంధుత్వం మాటున ఆమె రహస్య ఎజెండా ఏమిటంటే బావ చంద్రబాబు గారి సహాయంతో ఎంపీగా గెలిచి బిజెపి ప్రభుత్వంలో కేంద్ర మంత్రి కావాలనుకుంటున్నారు.అందుకే ఆయనపై ఈగ కూడా వాలకుండా విసనకర్ర ఊపుతున్నారు".

అని ట్వీట్ చేశారు.

వైరల్ వీడియో : అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!
Advertisement

తాజా వార్తలు