ఒకప్పుడు కూలి పని.. ఇప్పుడు డీఎస్సీలో టాపర్.. విజయలక్ష్మి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

కఠిన పేదరికం వల్ల దేశంలోని చాలా కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

అలా పేదరికం వల్ల ఇబ్బందులు పడిన వాళ్లలో వేమనపల్లి( Vemanapally ) మండలానికి చెందిన విజయలక్ష్మి ( Vijayalakshmi )కూడా ఒకరు.

బాల్యంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటుక బట్టీలో విజయలక్ష్మి బాల కార్మికురాలిగా చేరారు.వారంలో కొన్నిరోజులు బడికి వెళ్తూ మిగతా రోజులు పనికి వెళ్లేవారు.

ఈ విషయం తెలిసిన విజయలక్ష్మి చదువుతున్న స్కూల్ టీచర్ ఒకరు ఆమెకు అండగా నిలిచారు.విజయలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించారు.టీచర్ కళ్యాణి( Kalyani ), ఆమె భర్త సహాయంతో విజయలక్ష్మి ఇంటర్ చదివారు.

హైదరాబాద్ లో డీఈడీ శిక్షణ తీసుకున్న విజయలక్ష్మి 2018 డీఎస్సీలో ( 2018 in DSC )తృటిలో అవకాశం చేజార్చుకున్నారు.

Vijayalaxmi Inspirational Success Story Details Inside Goes Viral In Social Medi
Advertisement
Vijayalaxmi Inspirational Success Story Details Inside Goes Viral In Social Medi

ఈ ఏడాది వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్ ( DSC Notification )లో మంచి మార్కులు సాధించి విజయలక్ష్మి సెకండరీ గ్రేడ్ టీచర్ గా జాబ్ సాధించారు.తాజాగా ప్రభుత్వం నుంచి విజయలక్ష్మి ఉపాధ్యాయ నియామక పత్రం అందుకున్నారు.కళ్యాణి టీచర్ కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని విజయలక్ష్మి చెబుతున్నారు.

విజయలక్ష్మి సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Vijayalaxmi Inspirational Success Story Details Inside Goes Viral In Social Medi

ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకోవడం సులువైన విషయం కాదని ఈ విషయంలో విజయలక్ష్మి సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.విజయలక్ష్మిని నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.భవిష్యత్తులో విజయలక్ష్మి మరిన్ని భారీ విజయాలు అందుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

విజయలక్ష్మిని ప్రోత్సహించిన టీచర్ కళ్యాణిని సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.విజయలక్ష్మికి నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉండటం గమనార్హం.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

విజయలక్ష్మి తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు