ఫోకస్ రివ్యూ: ఫోకస్ సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ సూర్య తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఫోకస్.

ఇందులో విజయ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్ తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాకు వీరభద్ర రావు నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.వినోద్ సంగీతం అందించాడు.

ప్రభాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ను అందించాడు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, లుక్స్ బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.నటీనటులకు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

Advertisement

కథ:

పోలీస్ సూపరింటెండెంట్ గా వివేక్ వర్మ (భానుచందర్) కనిపించాడు.ఇక న్యాయమూర్తి ప్రమోద దేవి (సుహాసిని మణిరత్నం) వివేక్ వర్మ భార్య.

ఇక ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవిస్తున్న సమయంలో వివేక్ వర్మను ఎవరో హత్య చేస్తారు.దీంతో ఆయన అనుమానస్పద రీతిలో మరణించడంతో ఎస్సై విజయ్ శంకర్ ఆ కేసును దర్యాప్తు చేపడతాడు.

ఇక ఈ కేసును టేకప్ చేయడానికి ప్రేమ (అషు రెడ్డి) రంగంలోకి దిగుతుంది.దీంతో వివేక్ వర్మాన్ని ఎవరు హత్య చేశారు.ఆయనను ఎందుకు హత్య చేశారు.

చివరికి ఆ హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్నారా లేదా అనేది మిగిలిన కథలోనిది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

నటినటుల నటన:

పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశంకర్ లీనమయ్యాడని చెప్పవచ్చు.ఎమోషనల్ సీన్స్ లో బాగా ఆకట్టుకున్నాడు.సుహాసిని మణిరత్నం కూడా అద్భుతంగా నటించింది.

Advertisement

అషు రెడ్డి తన నటనలో మరింత మార్కులు సంపాదించుకుందని చెప్పవచ్చు.మిగిలిన నటీనటులంతా తమ పాత్రలలో బాగా లీనమయ్యారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ మంచి కథను చూపించాడు.వినోద్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.

నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.ప్రభాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

మిగిలిన టెక్నికల్ విభాగాలు బాగా పని చేశాయి.

విశ్లేషణ:

డైరెక్టర్ ఈ సినిమాను మంచి మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ ద్వారా చూపించాడు.డైరెక్టర్ ఈ సినిమాను ఎంచుకోవటం పెద్ద సాహసం అని చెప్పవచ్చు.

కథను అద్భుతంగా చూపించాడు.చాలా వరకు ట్విస్టులు బాగా ఆసక్తిగా అనిపించాయి.

కథను బోర్ కొట్టకుండా చూపించాడు.చాలావరకు డైరెక్టర్ ఈ సినిమాను బాగా చూపించే ప్రయత్నం చేశాడు.

ప్లస్ పాయింట్స్:

సినిమా కథ, ట్విస్ట్ లు, క్లైమాక్స్, నటీనటుల నటన, ఎమోషన్ సీన్స్, మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించింది.

బాటమ్

లైన్: చివరగా చెప్పాల్సిందే ఏందంటే ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో రూపొందిగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.పైగా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కూడా బాగా ఆకట్టుకుంది.

రేటింగ్: 3/5

తాజా వార్తలు